Bigg Boss6 Telugu: బిగ్ బాస్ షోల్ కేవలం అంతమంది మాత్రమే ఉంటారా..!

Bigg Boss6 Telugu: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు ప్రోమో తాజాగా విడుదలైంది. బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. సెప్టెంబర్ 4వ తేదీన ుంచి బిగ్ బాస్ షో బుల్లితెరపై ప్రసారం అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే గత సీజన్ కు భిన్నంగా ఈ సీజన్ లో కంటెస్టెంట్ల సంఖ్య తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సీజన్ లో కేవలం 12 లేదా 13 మంది మాత్రమే కంటెస్టెంట్లు మాత్రమే పాల్గొననున్నారని బోగట్టా. బిగ్ బాస్ సీజన్ 6కు కూడా నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నారని ఇప్పటికే విడుదలైన ప్రోమోతో కన్ ఫామ్ అయింది. ఇప్పిటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని తెలుస్తోంది. ఈనెల 25వ తేదీ నుంచి క్వారంటైన్ లో ఉండనున్నారని సమాచారం అందుంతోంది. ఈ సీజన్ లో పేరున్న కంటెస్టెంట్లు పాల్గొననున్నారని తెలుస్తోంది. భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్లు ఆఫర్ చేసి ఈ షో కోసం ప్రముఖ సెలబ్రిటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది.

మరోవైపు గతంలో బిగ్ బాస్ షఓ పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రాజకీయ నేతలు బిగ్ బాస్ షఓపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో వల్ల విడిపోయిన జంటలు కూడా ఇన్నాయి. బిగ్ బాస్ సీజన్ 6 ఎలా ఉండబోతుందోనని అభిమానులు మధ్య కూడా చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్6 సక్సెస్ కావాలని బిగ్ బాస్ అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel