Viral news: నా భర్తకు ముగ్గురు లవర్స్ కావాలి.. 32వేల జీతమిస్తా!

Viral news: భార్యాభర్తల వివాహేతర సంబంధాల కారణంగా అనేక మంది విడిపోవడం, ఆత్మహత్యలు చేస్కోవడం, హత్యలు చేయడం మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. అయితే భర్తల కోసం భార్యలు అమ్మాయిలను తీసుకొచ్చిన ఘటనలు మాత్రం చాలా అరుదు. కానీ ఓ భార్య మాత్రం తన భర్త కోసం ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ కావాలని ప్రకటన ఇచ్చింది. అంతే కాదండోయ్ అలా ఉన్న అమ్మాయికి నెలకి 32 వేల రూపాయల చొప్పున జీతం కూడా ఇస్తానంటోంది. అసలు ఈ ఇంతటి ప్రకటన చేసిన ఆ మహా ఇల్లాలు ఎవరు, ఆమె కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

44 ఏళ్ల ఫాతిమా తన భర్త సంతోషం కోసం ఈ యాడ్ ఇచ్చింది. తన భర్తకు ప్రియురాళ్లుగా వచ్చే అమ్మాయిలు తనకు స్నేహితురాళ్లని.. వారితో చాలా హాయిగా గడుపుతానని చెబుతోంది. అయితే ఇందుకోసం ఇప్పటికే ఓ అమ్మాయి వచ్చిందని ఆమెతో ఉన్న ఫొటో షేర్ చూసింది. మరో రెండు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని వివరించింది. త భర్తకు ప్రియురాళ్లుగా వచ్చే అమ్మాయిలు తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. వాళ్ల వయసు కనీసం 30 – 35 మధ్య ఉండాలని తెలిపింది. ఉన్నత పాఠశాల లేదా గ్రాడ్యుయేట్ డిగ్రీ కల్గి ఉండాలని చెప్పింది.ఉద్యోగం పొందిన మహిళలకు 32 వేల జీతంతో పాటు ఉచితంగా తన ఇంట్లోనే ఉండొచ్చని పేర్కొంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel