#Govt Jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs#Govt jobs

, ,

Karthika Deepam: నిరుపమ్ కు ప్రపోజ్ చేయడానికి వెళ్ళిన జ్వాలా.. సరికొత్త ప్లాన్ వేసిన శోభ..?

By Ramesh Babu

Published on: June 11, 2022 11:31 AM

Updated on: June 11, 2022 11:31 AM

Follow Us

---Advertisement---

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో. ఇప్పుడు తెలుసుకుందాం. వెంకట ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ కు ఒక భర్తగా సేవలు చేస్తాను అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

ఈరోజు ఎపిసోడ్ లో శోభ,నిరుపమ్,జ్వాలా మధ్య ఏదో సంబంధం ఉంది ఎలా అయినా దానిని కనిపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు హిమ అన్నీ తెలిసి కూడా ఎందుకు బావ ఇలా చేస్తున్నావు. నా మీద ఎందుకు ప్రేమ పెంచుకుంటున్నావు అని నిలదీస్తుంది. అప్పుడు నిరుపమ్ నీ మీద ప్రేమ ఎప్పటికి చావదు అని అంటాడు.

అయితే వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుంచి శోభ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడు హిమ నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి లో నా ప్రేమను చూసుకో బావ అంటూ నిరుపమ్ తో మాట తీసుకుంటుంది. ఆ అమ్మాయి ఎవరు అని నిరుపమ్ అడగగా జ్వాలా అని చెబుతుంది హిమ.

అప్పుడు ఒక్క సారిగా షాక్ అయిన నిరుపమ్ ఏం మాట్లాడుతున్నావు హిమ అంటూ విరుచుకు పడతాడు. ఆ మాటకు శోభ కూడా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు శోభ ఆ అవకాశం నాకు ఇవ్వచ్చు కదవే.. పోయి పోయి ఆ ఆటో దానికి ఎందుకు కట్ట పెడతావు అని మనసులో అనుకుంటుంది.

జ్వాల కి కూడా నువ్వు అంటే ఇష్టం బావ అని అనగా నిరుపమ్ స్టన్ అవుతాడు. ఇక నువ్వు జ్వాలని పెళ్లి చేసుకోవాలి బావ అని చెప్పి కళ్ళు తిరిగి కింద పడి పోతుంది. మరోవైపు ఆనందరావు కష్టాన్ని కార్తీక్ ఫోటో వైపు చూసుకుంటూ తనకి చెప్పుకున్నట్టుగా ఫీల్ అవుతాడు.

ఒకవైపు శోభ నిరుపమ్ ని ఆ ఆటో దానికి ఇచ్చి హిమ ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుంది అని తెగ ఆలోచిస్తుంది. ఆ తరువాత సప్న,సౌర్య చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయింది అని శోభ కు చెప్పడంతో శోభ జ్వాల చేతి మీద ఉన్న హెచ్ అక్షరం హిమ కాదు కదా.. అని ఆలోచిస్తుంది. మరొకవైపు హిమ జ్వాల తో ఇప్పుడు నీ ప్రేమ విషయం డాక్టర్ సాబ్ కి చెప్పవచ్చు అని ఆనందంగా ఉంటుంది.

ఇక ఆ మాటకు జ్వాల ఎంతో ఆనంద పడుతూ.. ఎలా చెప్పాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక హిమ పోయిన జన్మలో మనిద్దరం అక్క చెల్లెళ్ళం ఏమో అని అనడంతో జ్వాలా, హిమపై విరుచుకు పడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో తరువాయి జ్వాల నిరుపమ్ కి ప్రపోజ్ చేయడానికి దగ్గరగా వస్తుంది.

ఈ లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో జ్వాల ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. తర్వాత హిమ ఎందుకు వెళ్లిపోయావు అని అడగగా.. నా శత్రువు హిమ ఫోన్ చేసింది అని జ్వాల అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

, , , , ,

Join our WhatsApp Channel