October 5, 2024

Shawarma terror: షవర్మా తింటే చనిపోతారా… నిజమెంత, అబద్ధమెంత?

1 min read
If you eat Shawarma die or not

Shawarma terror: షవర్మా తింటే నిజంగానే చనిపోతారా… ఈ అనుమానం చాలా మందికి వస్తుంది. ఇటీవలే ఒకరిద్దరు షవర్మా తిని చనిపోయారు. అయితే అది తినడం వల్లే చనిపోయారని వైద్యులు కూడా నిర్ధారించడంతో చాలా మంది భయపడిపోతున్నారు. అయితే అది క్వాలిటీ చికెన్ కాకపోవడం, పాడైంది కావడం వంటి వాటి వల్లే అలా జరిగిందని మరికొందరు చెబుతున్నారు. అయితే పదే పదే వేడి చేయడం వల్ల పాడవుతుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే అమ్ముడు పోని షవర్మాను రోజుల పాటు ఫ్రిజ్ లో నిల్వ చేసి అమ్ముతున్నారు కూడా. అయితే నిపుణులు షవర్మా గురించి ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

If you eat Shawarma die or not

శవర్మా విషయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు తినే షవర్మా రోజుదా, గంటదా, పూటదా అనే విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందేనంటున్నారు. అంతే కాకుండా షవర్మా కోసం వాడే చికెన్ క్వాలిటీదా కాదా అనేదానిపై కూడా క్లారిటీ ఉండాలంటున్నారు. పాడైంది తినడం వల్ల ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. అళాగే పదే పదే షవర్మాను వేడి చేయడం వల్ల కూడా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే కేరళలో దేవానంద తిన్న షవర్మాలో రెండు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు వివరించారు. షిగెల్లాతో పాటు సర్మోనెల్లా బ్యాక్టీరియా ఆ షవర్మాలో బయటపడ్డాయట. ఈ బ్యాక్టీరియా కారణంగా డయేరియాతో పాటు జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి వస్తుందని వైద్యులు వివరించారు.