Crime love story: ఫేస్ బుక్ లో పరిచయం.. వాట్సాప్ లో ప్రేమాయణం.. చివరకు!

Crime love story: హైదారాబాద్ కు చెందిన ఓ అమ్మాయికి ఫేస్ బుక్ లో ఓ అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా… ఆ తర్వాత వివాహేతర సంబంధంగా మారిపోయింది. కానీ చివరకు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోమని అడగ్గా ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆ అబ్బాయి తనతో మాట్లాడిన న్యూడ్ వీడియో కాల్స్ వీడియోలను బయటపెడతానని చెప్పాడు. దీంతో ఆ అబ్బాయి అడ్డు తొలగించుకోవాలని… స్నేహితులతో కలిసి అతనిపై హత్యా ప్రయత్నం చేయించింది.

అయితే బాగ్‌ అంబర్‌పేట్‌కు చెందిన యశ్మ కుమార్ ఫొటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంతి హిల్స్‌కు చెందిన గృహిణి శ్వేతా రెడ్డితో నాలుగేళ్ల క్రితం ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం వారి మధ్య వివాహేతర బంధానికి దారితీసింది. ఈ క్రమంలోనే యశ్మ కుమార్‌, శ్వేతా రెడ్డితో న్యూడ్ కాల్స్ లో కూడా మాట్లాడాడు. అయితే ఆమె కూడూ ఇష్టంగానే అతనితో గడిపింది. అయితే నెల రోజులుగా యశ్మ…. శ్వేతకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకోవాలని…. లేదంటే వీడియోలను, ఫోటోలను బయటపెడతానని బెదిరించాడు. ఈ సమస్య నుంచి బయటపడాలకున్న శ్వేతారెడ్డి యశ్మకుమార్‌ను ఎలాగైనా అంతమొందించాలని పథకం వేసింది. ఫేస్‌ బుక్‌ ద్వారా పరిచయమైన మరో స్నేహితుడు ఏపీలోని కృష్టా జిల్లా తిరువురుకు చెందిన కొంగల అశోక్‌ కు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించింది. యశ్మకుమార్‌ను ఎలాగైన హత్య చేయాలని చెప్పింది.

Advertisement

ఈ నెల 4న నగరానికి వచ్చిన అశోక్, శ్వేతారెడ్డితో కలిసి… యశ్మ కుమార్ ఉన్న చోటుకి చేరుకున్నారు. ఇద్దరు కలిసి యశ్మ తలపై సుత్తితో కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. శ్వేతారెడ్డి, అశోక్‌తో పాటు వారికి సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel