SI Cheating: ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న ఎస్ఐ అరెస్ట్!

SI Cheating: తిరుపతిలో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్ఐ విజయ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రగిరిలో అతడిని అదుపులోకి తీసుకొని పామిడికి తీసుకెళ్లారు. ఎస్ఐ పై దిశ పోలీస్ స్టేషన్ లో కొన్ని రోజుల కిందట ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్ఆ ఆ యువతిని ఇటీవలే వివాహం చేసుకున్నాడు. మనస్తాపంతో రెండో యువతి పామిడి మండలం జి.ఎ.కొట్టాలకు చెందిన సరస్వతి బాయి ఆత్మహత్యకు యత్నించింది. అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న సరస్వతి మృతి చెందింది.

Advertisement

Advertisement

ప్రేమించి మోసం చేయడం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు పామిడి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే ఎస్ఐ విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు తాడిపత్రి డీఎస్పీ తెలిపారు. ఎస్ఐపై కేసు నమోదు చేసినట్లు… నేడు రిమాండ్ కు పంపుతున్నట్లు చెప్పారు. ఇతనిపై గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదుల వివాదాల మధ్యే అతడి వివాహం జరిగిందని డీఎస్పీ వివరించారు.

Advertisement
Advertisement