KGF2 Collections : బాక్సాఫీసు వద్ద రాఖీబాయ్ హవా.. నాలుగు రోజుల్లోనే 500 కోట్లకుపైగా వసూళ్లు!

KGF2 Collections : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు బాక్సాఫీసులను షేక్ చేస్తున్న సినిమా కేజీఎఫ్2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలైంది. అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. అయితే కామ్​స్కోర్​ నివేదిక ప్రకారం గ్లోబల్​ బాక్సాఫీస్​లో ఏప్రిల్​ 15 నుంచి 17 మధ్య అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల్లో ‘కేజీఎఫ్’​ రెండో స్థానంలో నిలిచింది.

KGF2 Collections
KGF2 Collections

అలాగే సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.500కోట్లకు పైగా కెలెక్ట్​ చేసింది. తొలి రోజు(రూ.165.37కోట్లు), రెండో రోజు(రూ.139.25), మూడో రోజు(రూ.115.08), నాలుగో రోజు(రూ.132.13) వచ్చినట్లు ట్రేడ్​ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే బాలీవుడ్​లోనూ చరిత్ర సృష్టించిన ‘కేజీఎఫ్​ 2’ మరో ఘనత సాధించనుంది. అత్యంత వేగంగా రూ.200కోట్ల క్లబ్​లో అడుగు పెట్టనున్న తొలి చిత్రంగా ఘనత అందుకోనుంది. నాలుగు రోజులు పూర్తయ్యే సరికి రూ.193.99కోట్లను కలెక్ట్​ చేసింది. తొలి రొజు(రూ.53.95), రెండో రోజు(రూ.46.79), మూడో రోజు(రూ.42.90), నాలుగో రోజు(రూ.50.35) వసూళ్లను సాధించింది. ఐదో రోజు(సోమవారం) రూ.200కోట్లు దాటడం పక్కా అనే చెప్పాలి.

Read Also : Kgf review: ఆర్ఆర్ఆర్ కంటే ‘కేజీఎఫ్-2’ 10 రెట్లు వేస్ట్

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel