Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Kgf review: ఆర్ఆర్ఆర్ కంటే ‘కేజీఎఫ్-2’ 10 రెట్లు వేస్ట్

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ కేజీఎఫ్-2. కేవలం కన్నడ, తెలుగు సినీ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్ మెంట్ తో ఉన్న సినిమా కేజీఎఫ్-2 అని చెప్పాలి. ఇది కన్నడ సినిమా అయినా.. భాషలకతీతంగా ఈ మూవీని చూసేందుకు ఆక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు కేజీఎఫ్-2 బృందాన్ని అభినందిస్తున్నారు. అయితే బాలీవుడ్ క్రిటిక్… కాంట్రవర్సీలకు కేరాఫ్ ... Read more

By Vinod Kumar

Published on: April 14, 2022 7:40 PM

Updated on: June 5, 2022 1:31 AM

---Advertisement---

సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ కేజీఎఫ్-2. కేవలం కన్నడ, తెలుగు సినీ అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ఎంతో ఎక్సైట్ మెంట్ తో ఉన్న సినిమా కేజీఎఫ్-2 అని చెప్పాలి. ఇది కన్నడ సినిమా అయినా.. భాషలకతీతంగా ఈ మూవీని చూసేందుకు ఆక్తిని చూపిస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ సినిమా మొదటి రోజు హిట్ టాక్ తెచ్చుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు కేజీఎఫ్-2 బృందాన్ని అభినందిస్తున్నారు. అయితే బాలీవుడ్ క్రిటిక్… కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కమల్ ఆర్ ఖాన్(కేఆర్కే) మాత్రం ట్విట్టర్ వేదికగా భిన్నంగా స్పందించారు.

 

కేజీఎఫ్-2 సినిమా తీసి.. ప్రశాంత్ నీల్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రేక్షుకులను మోసం చేశారని ఆయన విమర్శించారు. ఈ సినిమా తీసినందుకు ప్రశాంత్ నీల్ ను జీవితాంతం జైళ్లో పెట్టాలన్నారు. ఇలాంటి మెదడు లేని దర్శకులను ప్రోత్సహించకూడదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈసినిమాలోని ఓ సన్నివేశంపై కేఆర్కే వ్యంగ్యంగా స్పందించారు. భారత మిలటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ కలిసినా… రాఖీ అనే వ్యక్తితో పోరాడలేకపోయారని విమర్శించారు. ఇలా ఉంటే.. పాకిస్థాన్, చైనాతో భారత్ ఎలా పోరాడుతుంది ప్రశాంత్ భాయ్ అని దర్శకుడిని ప్రశ్నించారు. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ కంటే 10 రెట్లు చెత్త సినిమా అంటూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు కేఆర్కే.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.