...

Sonakshi Sinha : హీరోయిన్ బాత్రూంలో దూరిన అభిమాని.. ఎందుకో తెలుసా?

Sonakshi Sinha : బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హాకు వింత అనుభవం ఎదురైంది. ‘ది ఖత్రా ఖత్రా’ షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి.. తన వ్యానిటీ వ్యాన్​లో కూర్చుంది. ఫోన్ చూస్కుటూ ఆమె ఎంజాయ్ చేస్తుండగా… ఇంతలో ఆమె అభిమానిని అంటూ ఓ వ్యక్తి వాష్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. మేడమ్ నేను మీకు పెద్ద అభిమానిని అంటూ చెప్పాడు. మీ కోసం రాత్రి నుంచి ఇక్కడే బాత్రూంలో ఉండి ఎదురు చూస్తున్నానంటూ వివరించాడు. అంతే కాకుండా సోనాక్షి సిన్హా అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపించాడు.

Advertisement

దీంతో ఆశ్చర్యపోయిన సోనాక్షి అతడితో కాసేపు మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ అతడు మాత్రం అక్కడ గందర గోళం సృష్టించాడు. అద్దంపై లిప్​స్టిక్​తో ‘ఐ లవ్​ యూ సోనా’ అని రాశాడు. అంతే కాకుండా దీన్నే నా రక్తంతో కూడా రాయగలనంటూ చెప్పాడు. వెంటనే కత్తి తీసుకొని తన మెడపై పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోమని.. లేకపోతే పొడుచుకుంటానంటూ బెదిరించాడు. భోయంతో సోనాక్షి సిన్హా ఒక్కసారిగా కేకలు వేసింది. అయితే ఇదంతా ప్రాంక్ అంటూ ఆ వ్యక్తి చెప్పగా… సోనాక్షి ఆశ్చర్యపోయింది.

Advertisement

Read Also : Gold prices today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు..!

Advertisement
Advertisement