Varun Tej: నిహారిక పబ్ వ్యవహారం… వరుణ్ మెడకు చుట్టుకొనుందా… ఆందోళన చెందుతున్న మెగాఫ్యామిలీ!

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక శనివారం బంజారా హిల్స్ పబ్ లో అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిహారిక తన తండ్రి నాగబాబు గురించి నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే గత రెండు రోజుల నుంచి నిహారిక వ్యవహారం గురించి మెగా అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మెగా డాటర్ వ్యవహారంతో మెగా ప్రిన్స్ చిక్కులలో పడనునట్లు తెలుస్తోంది.

మెగా హీరో వరుణ్ తేజ్ గత రెండు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి నటించిన గని సినిమా ఏప్రిల్ 8 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక రెండు సంవత్సరాల నుంచి వరుణ్ తేజ్ కష్టపడి నటించిన ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రమోషన్ నిర్వహించి సినిమాకి భారీ హైప్ తీసుకురావాలని చిత్ర బృందం భావించారు. అయితే నిహారిక వ్యవహారం వరుణ్ తేజ్ ను ఇబ్బందులలో పడవేయబోతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొనబోయే వరుణ్ తేజ్ కి నిహారిక గురించి ప్రశ్నలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

ఇలా నిహారిక గురించి ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు ఎదురుకాకుండా ఉండేలా ప్లాన్ చేయాలి. ప్రస్తుతం ఈ మెగా హీరో ముందున్న పెద్ద సమస్య ఇదే అని చెప్పాలి. నిహారిక ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని కేవలం పబ్ లో ఉన్నందుకే తనను పోలీసులు అరెస్టు చేశారని మెగా కుటుంబం క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ వ్యవహారం గురించి మీడియా ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన వరుణ్ తేజ్ గని ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తీరా సినిమా విడుదల కాబోతున్న సమయంలో నిహారిక ఇష్యూ కావడంతో ఈ సినిమాకి మరొక సమస్య వచ్చి పడింది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని మెగా ఫ్యామిలీ ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel