Parvathi and Bhaktha discuss Padmavathi's kind nature. Later, Murali finds Padmavathi at a restaurant.
Nuvvu Nenu Prema Serial Aug 4 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా పద్మావతి కి రెస్టారెంట్లో లో పని దొరుకుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.విక్కీ యోగా చేస్తుంటే వాళ్ల పని మనిషి జ్యూస్ తీసుకొని అక్కడికి వస్తుంది. అప్పుడు విక్కీ ఆమె స్థానంలో పద్మావతి ని ఊహించుకొని నువ్వేంటి ఇక్కడ ఉన్నావు తిరుపతి వెళ్లలేదా అంటాడు. అప్పుడు పనిమనిషి ఇది మా ఊరే కదా బాబు గారు అంటుంది. వెంటనే విక్కీ ఓ నువ్వా వెళ్లి పని చూసుకో అంటాడు.
ఇక విక్కీ ఇంట్లోకి వస్తుంటే కిందపడపోతుంటాడు. అప్పుడు వాళ్ళ నాయనమ్మ వచ్చి చూసుకొని నడవచ్చు కదా అంటుంది.ఆమె స్థానంలో కూడా పద్మావతిని ఊహించుకుంటాడు విక్కీ నాకు ఏమైంది పదేపదే పద్మావతి గుర్తుకువస్తుంది అనుకుంటాడు. ఇక తన రూమ్ లోకి వచ్చిన మాయ ని చూసి పద్మావతి అనుకొని నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అంటాడు. అప్పుడు మాయ నువ్వే కదా నన్ను తీసుకొచ్చావు అంటుంది. మీ బావగారు షాపింగ్ కి వెళ్లి అక్కడ నుండి రెస్టారెంట్ కి వెళ్దాం అన్నాడు. ఇక నువ్వు రెడీ అవ్వు అంటుంది. అప్పుడు విక్కీ నాకు ఆఫీస్ లో వర్క్ ఉంది నేను డైరెక్ట్ గా రెస్టారెంట్ కి వస్తాను అంటాడు.
పద్మావతి గుడికి వెళుతుంది. అక్కడికి వెళ్ళగానే తన కన్ను అదురుతుంది. అప్పుడు టెంపరోడు కానీ వచ్చాడా ఏంటి అని భయపడుతుంది. విక్కి నిజంగానే అక్కడికి వస్తాడు. దండం పెట్టుకుంటున్న పద్మావతిని చూసి తను కాదేమో అనుకుంటాడు. ఇదంతా నా బ్రమా అనుకుంటా అని చెప్పి అక్కడి నుండి పద్మావతి ని ఏమనకుండా వెళ్ళిపోతాడు. ఇక పద్మావతి విక్కీ రావడం చూసి ఏంటి నన్ను చూసి కూడా ఏమనకుండా వెళ్ళిపోతున్నాడు. ఇక ఈ పద్మావతి తో పెట్టుకుంటే మామూలుగా ఉండదని తనకు తెలుసు పద్మావతి పద్మావతి ఇక్కడ తనకు తెలుసు పద్మావతి ఇక్కడ తగ్గేదే లే అంటుంది.
ఇక అరవింద ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసుకుని అక్కడి నుండి రెస్టారెంట్ కి వస్తారు. ఇక అరవింద వాళ్ల పిన్ని అరవింద నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మీ ఆయన నీకోసం సంవత్సరమంతా సరిపడే షాపింగ్ చేయించాడు అంటుంది. అప్పుడు ఆర్య బావా అలా షాపింగ్ చేయడానికి కారణం బావ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా రోజులు బయటే ఉంటాడు కదా అప్పుడు నువ్వు ఏమీ అనకూడదని ఇలా చేయించాడు అంటాడు. ఆర్య అలా అనగానే అరవింద ఆర్య పై కోపడుతుంది. మీ బావ గారిని అలాగే అంటావా ఆయన గురించి నాకు పూర్తిగా తెలుసు ఆయన ఎక్కడ ఉన్నా నా గురించి ఆలోచిస్తారు అంటుంది.
వెంటనే ఆర్య అక్క నేను జోక్ చేశాను అంటాడు. అప్పుడు కృష్ణ వదిలేయ్ రాణమ్మ జోక్ చేశాను అని చెబుతున్నాడు కదా అంటాడు. ఇక లోపలికి వెళ్దాం పదండి అంటూ రెస్టారెంట్ లోకి వెళ్తారు. అరవింద విక్కీ ఇంకా రాలేదు ఏంటి అనగానే…
వెళ్తుంది. ఇక విక్కీ కి అక్కడికి పద్మావతి వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడున్న పద్మావతిని చూసి తను కాదేమో అనుకొని లోపలికి వెళ్తాడు. ఇక వాళ్లతో సారీ లేటయింది అంటాడు. అప్పుడు అరవింద ఏం పర్లేదు నీ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం కూడా అయిపోయింది అంటుంది. ఎవరు ఇచ్చారు అని విక్కి అనగానే నీకు ఇష్టమైన ఫుడ్ మాయ ఆర్డర్ చేసింది అంటాడు కృష్ణ.
అప్పుడు విక్కీ మేము కొన్నేళ్లుగా ట్రావెల్ అవుతున్నాం కదా మా ఇష్టాఆఇష్టాలు అభిరుచులు ఎంతగానో కలిసిపోయాయి అందుకే తనంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఇష్టం ఉంటే స్నేహం చేయాలి తొందరపడి పెళ్ళి చేసుకోకూడదు. ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి అంటాడు కృష్ణ. అప్పుడు ఆర్య కృష్ణ వైపు చూస్తుంటాడు. ఏంటి అలా చూస్తున్నావ్ అనగానే నేను మీ గురించి చెప్తున్నారు అనుకుంటున్నాను అంటాడు. చ చ లేదు నాకు రాణమ్మ అంటే ప్రాణం అంటాడు. ఇక తన మనసులో ఆస్తి వల్ల తనని పెళ్లి చేసుకున్నానని ఇక పద్మావతి అంటే తనకు చాలా ఇష్టమని తన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు.
ఇక పద్మావతి వాళ్ళ అమ్మానాన్న పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటారు. తను చేస్తున్న క్యాటరింగ్ పనికి బాధపడాలో లేక సంతోషపడాలో అర్థం కావడం లేదు పార్వతి అంటాడు. ఎందుకండి బాధ అనగానే పెళ్లీడుకొచ్చిన పిల్ల పెళ్లి చేసుకోకుండా ఈ విధంగా క్యాటరింగ్ చేయడం అనేది చాలా బాధగా ఉంది. ఇదంతా నా చేతగాని తనం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇక పద్మావతి కూతురు లాగా కాకుండా ఒక కొడుకు లాగా మనల్ని ఆదరిస్తుంది. ఆ శ్రీనివాసుడే పద్మావతి లాంటి కూతుర్ని మనకి పుట్టించాడు అంటాడు. మీరు చేతగాని తనం అని అనుకోకండి మీరే కదా పిల్లలకు చెప్తారు వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడాలి అని ఇప్పుడు మన పిల్లలు కూడా అదే చేస్తున్నారు.
మొదట్లో నాకు పద్మావతి అంటే చాలా భయం ఉండేది తన జీవితం ఎలా ఉంటుందో ఏమో అని కానీ ఇప్పుడు పద్మావతి చేసిన ధైర్యానికి చాలా సంతోషంగా ఉంది అండి. ఇక మనం మన పిల్లల గురించి భయపడాల్సిన అవసరం లేదండి. పద్మావతి లాంటి మంచి మనసు ఉన్న అమ్మాయికి ఆ శ్రీనివాసుడే రక్షగా ఉంటాడు. తనకు అండగా నిలబడతాడు అంటుంది పార్వతి. ఇక కృష్ణ రెస్టారెంట్ లో పద్మావతిని చూసి షాక్ అవుతాడు. ఇక రేపు ఏం జరగబోతుంది చూడాలి.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.