parandhamaiah-surprises-tulasi in todays intinti gruhalakshmi serial episode
Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి ఆఫీస్ లో జరిగిన విషయాన్ని తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి గిఫ్ట్ ని చూసి ఇందులో ఏముంది మావయ్య అని అడగగా అది నీ కోసమే తులసి కొద్దిసేపు ఆగు నీకే తెలుస్తుంది అని అంటాడు పరంధామయ్య. అప్పుడు దివ్య మామ్ గిఫ్ట్ నీ చేతిలో ఉంది కదా ఓపెన్ చేసి చూడు అని అనగా పరంధామయ్య వద్దు మమ్మల్ని అందరినీ ఒకచోటకు తీసుకొని వెళ్తాను అక్కడ ఈ గిఫ్ట్ తెరిచి చూడండి అని అంటాడు పరంధామయ్య.
అప్పుడు అనసూయ అపరంధామయ్యను వెటకారంగా మాట్లాడిస్తుంది. అప్పుడు పరంధామయ్య మాత్రం ఒక్కసారి నా మాట వినండి రండి ఎక్కడికి ఏమీ అని మాత్రం మరవద్దు అని అంటాడు. ఇప్పుడు అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి తాతయ్య క్యాబ్ బుక్ చేస్తాను అని అనగా అవసరం లేదు లేరా అని ఆల్రెడీ బుక్ చేశాను అని చెప్పి పరంధామయ్య అందరిని తీసుకొని తన పాత ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు.
అప్పుడు తులసి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు మావయ్య అని అడగగా, అప్పుడు దివ్య ఇంకేముంది మామ్ ఈ ఇంట్లో హోమ్ టూర్ చేద్దామని అని అనగా వాళ్ళ ఇంట్లో వీడియోలు తీయడం ఏంటి అని అనసూయ అంటుంది. అప్పుడు తులసి ఇకనుంచి వెళ్ళిపోదాం పద మామయ్య నాకు ఇక్కడ ఉంటే బాధగా ఉంది అని అంటుంది. ఇంటిని నా చేతులారా కోల్పోయాను నా గతం అంతా ఈ ఇంటి తోనే ముడిపడి ఉంది అని అంటుంది తులసి.
దయచేసి వెళ్ళిపోదాము అని అనకు రెండు నిమిషాలు ఆగమ్మా గిఫ్ట్ తెరువు అని అంటాడు. గిఫ్ట్ తెరవగా ఏవో పేపర్లు ఉండటం చూసి తులసి అర్థం కాక అదోలా చూస్తూ ఉండగా అప్పుడు పరంధామయ్య అసలైన గిఫ్ట్ అంటే ఇది ఈ ఇంటిని అమ్మ పేరు మీద రాయించేసాను అని అనడంతో అందరూ ఒక్కసారిగా ఆనందపడతారు. అప్పుడు తులసి నా పేరు మీద ఎందుకు మామయ్య అసలు ఎందుకు అనడం ఎందుకు అని అడుగుతుంది.
ఇల్లు వదిలి వెళుతున్నప్పుడు నీ కళ్ళలో చాలా బాధలు చూసాను అందుకే నీకు మావయ్యగా ఏదైనా చేయాలి అనుకున్నాను అందుకే ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చాను అని అంటాడు. అప్పుడు ఈ ఇంటిని మీ పేరు మీద ఉంచుకోండి మామయ్య రాస్తే మళ్లీ దురదృష్టంతో కోల్పోతానేమో అని అనగా వెంటనే పరంధామయ్య నీ పేరు మీద ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అని అంటాడు. అప్పుడు అనసూయ అవును నీకు ఈ ఇల్లు కొనడానికి ఎంత డబ్బులు ఎక్కడివి అని అడుగుతుంది.
తులసి కూడా ఆనందంలో మర్చిపోయాను మామయ్య ఎక్కడివి అని అడుగుతుంది. అప్పుడు పనుందామయ్యా నేను తర్వాత చెప్తాను అది ఒక సీక్రెట్ అందరూ లోపలికి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు తులసి నిలయం అన్న బోర్డుని ఆ ఇంటికి తగిలిస్తారు. అప్పుడు తులసి ఆ బోర్డును తగిలించడంతో అందరూ కలిసి ఆనందంగా చప్పట్లు కొడతారు.. తర్వాత అందరూ ఆ ఇంటిని చూస్తూ ఆనందంగా లోపలికి వెళ్తారు.
అప్పుడు తులసి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా అందరూ కలిసి ఆమెపై పువ్వుల వర్షం కురిపిస్తారు.ఆ తర్వాత తులసి ఇల్లు మొత్తం తిరిగి తన జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చి ఆనంద పడుతూ ఉంటుంది. ఇప్పుడు తులసి ఆనందాన్ని చూసిన పరంధామయ్య ఆనందపడతాడు. అప్పుడు తులసి ఎందుకు మామయ్య ఇల్లు నాకు ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతుంది.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.