Viral Video : పెద్ద పులి.. చూస్తేనే వణుకుపుడుతుంది. అలాంటిది దగ్గరగా వస్తే ఏమైనా ఉందా? పైప్రాణాలు పైనే పోతాయి. అలాంటి పెద్దపులి ఓ వ్యక్తిపై అమాంతం దూకేసింది. ఆ మనిషి ఎటు తప్పించుకోలేని పరిస్థితి. పులి దాడి నుంచి తప్పించుకునేందుకు మరో దారి కనిపించలేదు. పులిచేతిలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనే భయమే కనిపించింది. తన పదునైన పంజాతో పెద్ద పులి ఆ మనిషిపై విసిరింది.
పులి పంజా దెబ్బకు ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. కానీ, ఏదోలా ఆ పులి నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. పులి దాడి చేసేందుకు ఎగిరి ఆ వ్యక్తిపై దూకేసింది. తన పంజాను అతడి మెడపై విసిరింది. తన వాడియైన పళ్లతో అతడి చేతిని చీల్చసాగింది. అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి పులి కళ్లలో తన చేతి గోళ్లతో గట్టిగా పొడిచాడు. అంతే.. పులి భయంతో అతడిని వదిలిసే అక్కడి నుంచి పారిపోయింది.
ఊరి జనాన్ని వణికిస్తున్న ఆ పులిని ఎట్టకేలకు గ్రామ ప్రజలు వెంటాడి మరి పట్టేసుకున్నారు. పశువులతో పాటు మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీస్తున్న పెద్ద పులిని వలతో పట్టేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ క్రమంలో గ్రామ ప్రజల నుంచి తప్పించుకుని పారిపోతున్న పెద్ద పులి అడ్డు వచ్చిన ఒక వ్యక్తిపై ఎగిరి దూకింది. పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా వీలు కాలేదు.
ఆ వ్యక్తి పులిని భయపెట్టి మరి తప్పించుకున్నాడు. చివరికి ఆ పులి అతడిని వదిలేసి పారిపోవడం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ పులి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అది నిజంగా దాడి చేయలేదని, పులి ఆ వ్యక్తికి బాగా అలవాటు అయిందననేంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూడవచ్చు.
Read Also : Viral video: ట్రైన్ నుంచి బయటకు వంగి మరీ రీల్.. చివరకు ఏమైందంటే?
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
Ginger Benefits : కీళ్లనొప్పులు, దగ్గు, జలుబు, కడుపునొప్పి, మోషన్ సిక్‌నెస్, వికారం, అజీర్ణం వంటి సందర్భాల్లో అల్లంను ఎక్కువగా…
This website uses cookies.