Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రేమ్ గత ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలను గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. తన తల్లి తనకు గిటారు ఇవ్వడం, ఆశీర్వదించడం ఇవన్నీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడు శృతి బాధపడకు అంటూ ప్రేమ్ ఓదారుస్తూ ఉంటుంది. మరొకవైపు తులసి ప్రేమ్ పుట్టినరోజు సందర్భంగా గుడికి వెళ్లి కొడుకు పేరు మీద అర్చన చేయిస్తూ ఉంటుంది.
ప్రేమ్ ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా బాగా ఉండాలి అని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. మరొక వైపు ఫ్రేమ్, శృతి లు కూడా గుడి కి వస్తారు. తులసి ఎలా అయినా కూడా గుడికి వస్తుంది అని శృతి తో ప్రేమ్ చెబుతూ ఉంటాడు. అప్పుడు శృతి ఒకవేళ ఆ తులసి ఆంటీ రాకపోతే నువ్వు బాధ పడదు అని చెబుతూ ఉంటుంది. కానీ చూసి చెప్పినా వినకుండా ప్రేమ్ గుడి లోపలికి వెళ్తాడు. గుడిలో మొదట తులసి కనిపించకపోయేసరికి బాధపడతాడు.
కొడుకు, కోడలిని చూసిన తులసీ పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఇంతలో ప్రేమ్ పూజారి గారు ప్రేమ్ అనే పేరు పై ఎవరైనా అర్చన చేయించారా అని అడగగా అప్పుడు తులసి పూజారి ని చూసి చెప్పద్దు అన్నట్టుగా తల ఊపుతుంది. అప్పుడు పూజారి లేదు అనేసరికి సరే అమ్మ వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని ఎదురు చూస్తూ ఉంటాడు ప్రేమ్. శృతి,ప్రేమ్ లు మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న తులసి ఎమోషనల్ అవుతుంది.
ప్రేమ్ తన మాటల ద్వారా తులసి పై ఉన్న ప్రేమను బయటపెడతాడు.అది చూసిన తులసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈ రోజు అమ్మ రాకపోతే ఇకపై ఎప్పుడు బర్త్ డే జరుపుకొను అని అంటాడు. ఇవ్వాలి కనపడకుండా ఆటో ఎక్కి వెళ్లి పోవడాన్ని ప్రేమ్ గమనించి అమ్మ అమ్మ అని సంతోష పడతాడు. మరొకవైపు అంకిత దివ్య మనసు మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ, దివ్య మాత్రం తన తల్లి పై మరింత ద్వేషం పెంచుకుంటుంది.
ఈరోజు ఎలాగయినా అన్నయ్య ని పిలిపించి అన్నయ్య బర్త్ డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం మీరు అమ్మ ని అడగండి అని అంకితని బ్రతిమలాడుతుంది. అప్పుడు అంకిత సరే అని అంటుంది. మరొకవైపు ప్రేమ్,శృతి లపై ఇంటి ఓనర్ లు ఫైర్ ఉంటారు. ఇక ప్రేమ్, శృతి కోసం ఆటో నడపాలి అనుకున్న మాట శృతి కి తెలియడంతో శృతి ప్రేమ్ ని చొక్కా పట్టుకుని నిలదీస్తుంది. ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు అంటూ ఎమోషనల్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World