...

LPG Gas Subsidy : ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి?

LPG Gas Subsidy : ప్రస్తుత కాలంలో ప్రజలకు అత్యవసర వస్తువులలో గ్యాస్ కూడా చాలా అవసరం. కట్టెలను ఉపయోగించి వంటలు చేసేవారు. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ప్రజలు కూడా మారుతూ కొత్త పద్ధతులకు అలవాటు పడుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో గ్యాస్ ఉపయోగించి వంట చేస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ ధర రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు గ్యాస్ కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం ఈ LPG గ్యాస్ ధరల ప్రభావాన్ని తగ్గించడానికి LPG సబ్సిడీ అమలులోకి తెచ్చింది. అయితే ఈ LPG సబ్సిడీ పొందటానికి తప్పనిసరిగా మీ LPG సర్వీస్ ప్రొవైడర్‌కు మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను లింక్ చేయాలి. అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతా మీ ఆధార్ కార్డ్‌కి కనెక్ట్ చేయబడిందో లేదో నిర్ధారించుకోవాలి.

LPG Gas Subsidy
LPG Gas Subsidy

రోజు రోజుకి గ్యాస్ ధరలు పెరిగిపోవడంతో ప్రభుత్వం మీద ప్రజలలో వ్యతిరేకత మొదలైంది.అందువల్ల పెరుగుతున్న LPG గ్యాస్ ధరల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించటానికి కేంద్ర ప్రభుత్వం రూ.200 సబ్సిడీని ప్రకటించింది . అయితేఈ సబ్సిడీ అందరికీ వర్తించదని.. కేవలం 9 కోట్ల మందికి మాత్రమే సబ్బిడీ వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. అయితే ఇంతకు ముందు ఈ LPG సబ్సిడీ వచ్చే వారికి ఇప్పుడు ఈ సబ్సిడీ డబ్బులువస్తాయో, రావో తెలియని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సబ్సిడీ లిస్ట్‌లో నుంచి కొంత మందిని తొలగించింది.

అందువల్ల సబ్సిడీ మనకి వస్తుందో? లేదో? తెలియాలంటే సబ్సిడీ పొందే లిస్ట్ లో మన పేరు ఉందో లేదో తెలుసుకోవాలి. అయితే సబ్సిడీ లిస్టులో మన పేరు ఉందో లేదో తెలుసుకోవటానికి ముందుగా అధికారికి వెబ్ సైట్ www.mylpg.in కు వెళ్ళాలి. దీనిలో లాగిన్ అనే ఆప్షన్ దగ్గర లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చి లాగ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా ఓపెన్ చేసిన వెబ్ పేజీలో టాప్ లో గ్యాస్ చిత్రాలు కనిపిస్తాయి. అప్పుడు అందులో మీ గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. అంటే భారత్ గ్యాస్(Bharath Gas), హెచ్ పీ గ్యాస్(HP Gas), ఇండియన్ గ్యాస్(Indene Gas) లలో మీ గ్యాస్ ఏంటో ఎంచుకోవాలి. ఆ తర్వాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీపై క్లిక్ చేయాలి. మీ సిలిండర్‌కు సబ్సిడీ వచ్చిందా లేదా వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఒక వేళ మీకు సబ్బిడీ వస్తే మీ పేరు నమోదు చేసి ఉన్నట్లు.. లేదంటే..వెబ్‌సైట్‌లోనే ఫిర్యాదుకు సంబంధించిన నంబర్లలో సంప్రదించవచ్చు.