VJ Sunny : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల ముగిసిన సంగతి అందరికీ విదితమే. బుల్లితెరపై సక్సెస్ ఫుల్ షో గా ఇది రన్ అవుతోంది. సీజన్స్ వైజ్‌గా ఈ రియాలిటీ షో రన్ అవుతుండగా, అందులో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఆ సీజన్‌కు హైలైట్ అవుతుంటారు. కానీ, నిరుపమ్ పరిటాల మాత్రం ఎవర్ గ్రీన్ హైలైట్ పర్సన్ అని చెప్పొచ్చు.
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ సీరియల్ అయిన ‘కార్తీక దీపం’లో డాక్టర్ బాబుగా నిరుపమ్ ప్రతీ రోజు తెలుగింటి ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు. కాగా, తాజాగా డాక్టర్ బాబు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ విజేత వీజే సన్నీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో చాలా మంది తన ఫ్రెండ్స్ ఉన్నారని డాక్టర్ బాబు అన్నారు.తాను రెగ్యులర్‌గా బిగ్ బాస్ చూస్తానని, ఆట ఎలా జరిగిందని తెలుసుకుంటానని పేర్కొన్నాడు. ఇకపోతే సీజన్ ఫైవ్‌లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ మానస్, సన్నీ, విశ్వ, సిరి, రవి , ఉమాదేవి తన ఫ్రెండ్సని తెలిపాడు. మొదట్లో తాను విశ్వ విజేత అవుతాడని అనుకున్నానని, కానీ, చివరకు వీజే సన్నీ విజేత అయ్యాడని చెప్పాడు. వీజే సన్నీ షోలో పార్టిసిపేట్ చేసే క్రమంలో స్టార్టింగ్‌లో చాలా అగ్రెసివ్‌గా ముందుకెళ్లాడని, అయితే, అది అతని రియల్ క్యారెక్టర్ కాదని చెప్పుకొచ్చాడు.
ఇక తర్వాత క్రమంలోనే వీజే సన్నీ జోవియల్ యాంగిల్ బయటకు వచ్చిందని, అలా సెకండాఫ్‌లో అతనికి అది బాగా కలిసొచ్చిందని ఈ సందర్భంగా డాక్టర్ బాబు వివరించాడు. ఇకపోతే తనకు బిగ్ బాస్ ఆఫర్ వస్తే ఆలోచిస్తానని, అప్పటికి తనకున్న కమిట్ మెంట్స్ ను బట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకుంటానని పేర్కొన్నాడు. అయితే, తాను చేస్తున్న ప్రాజెక్ట్స్ ను మధ్యలోనే వదిలేసి అయితే వెళ్లబోనని అన్నాడు.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.