Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి,రిషి ని డిస్టర్బ్ చేస్తుండడంతో జగతి సాక్షి ని బయటకు చేయి పట్టుకొని లాక్కుని వస్తుంది. ఇంతలోనే అక్కడే ఉన్న దేవయాని ఏంటి జగతి ఎక్కువ చేస్తున్నావు అని అనగా సాక్షి అంతకంటే ఎక్కువ చేస్తోంది అక్కయ్య అని అంటుంది. అప్పుడు సాక్షికి తల్లిగా నాకు ఆ అధికారం ఉంది అని ముఖం మీదే చెబుతుంది.
అంతేకాకుండా ఇప్పుడు నువ్వు ఇక్కడినుంచి వెళ్లకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ జగతి కోప్పడుతుంది. అప్పుడు దేవయాని నువ్వు వెళ్ళు సాక్షి అని చెప్పి సాక్షి ని పంపింస్తుంది. ఆతర్వాత దేవయాని జగతి తో మాట్లాడుతూ నిన్ను ఎప్పటికి రిషి నిన్ను తల్లిగా అంగీకరించడు అని అనగా అప్పుడు జగతి, రిషి ని కన్నది నేను ఎలాంటి స్వార్థం లేకుండా రిషి బాగుండాలని కోరుకునేదే నేను అని అంటుంది జగతి.
ఆ తర్వాత మహేంద్ర,రిషి పక్కలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో వసు, మహేంద్ర కు వీడియో కాల్ చేసి రిషి గురించి అడుగుతూ రిషి ని చూసి బాధ పడుతుంది. ఆ తర్వాత వసు ఇంటి బయట నిలబడి బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి గౌతం వస్తాడు. రిషి ని నేను అలా మంచంపైన చూడలేకపోతున్నాను అని అంటాడు.
అప్పుడు గౌతమ్ మాట్లాడుతూ నువ్వు రిషి కి నువ్వు చెప్పావు అని తెలిసి నేను చాలా ఫీల్ అయ్యాను. నువ్వు కూడా రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన తర్వాత చాలా ఫీల్ అయ్యావు కదా అని గౌతమ్, వసు ని అడుగుతాడు. ఆ తర్వాత వసు, రిషి కోసం తెచ్చిన అమ్మవారి కుంకుమను గౌతం చేతిలో పెడుతుంది. ఆ తర్వాత గౌతమ్ నాకు అంత అర్థం అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొక వైపు మంచం పై నుంచి రిషి కింద పడబోతుండగా ఇంతలో అక్కడికి జగతి వచ్చి పట్టుకుంటుంది. అప్పుడు కొద్దిసేపు జగతి తల్లిగా ఫీలవుతూ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత కోపం ఉంటే తీర్చుకోవాలి దుఃఖం నుంచి బయట పడేయాలి అని రిషి తో అని అంటుంది. అప్పుడు రిషి నన్ను ఒంటరిగా వదిలేయండి అని అనడంతో జగతి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత అక్కడికి గౌతం వచ్చి వసు ఇచ్చిన కుంకుమను రిషికి పెడతాడు. రేపటి ఎపిసోడ్ లో రిషి మళ్లీ కాలేజీకి తిరిగి రావడంతో అప్పుడు స్టూడెంట్స్ అందరూ గులాబీ పూలు ఇస్తుండగా ఇలాంటి పూలు అని నాకు నచ్చవు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ వసు చేతిలో ఉన్న ఫ్లవర్ రిషి జేబులో ఉండటం చూసిన మహేంద్ర మనం ఏది వద్దు అనుకుంటామో అది మన దగ్గరికి వస్తుంది అని అంటాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World