Guppedantha Manasu Aug 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు ఎంగేజ్మెంట్ రింగు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో వసుధార ఎంగేజ్మెంట్ రింగుకి దారాన్ని కట్టుకొని మెడలో వేసుకొని ఫోటోలు దిగుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు వసు టెన్షన్ పడుతూ భయం భయంగా ఏంటి సార్ ఈ టైం లో వచ్చారు అని అనగా అప్పుడు రిషి ఎందుకోసం దారా అంత టెన్షన్ పడుతున్నావు ఏదో తప్పు చేసినట్టు మొహం ఎందుకు అలా పెట్టావు అని అనడంతో ఏమి లేదు అని అంటుంది వసు.
అప్పుడు రిషి అక్కడ ఒక పుస్తకం తీసుకొని ఇవన్నీ ముఖ్యమైన లెసన్స్ ఇవి ఈరోజు రాత్రికి చదివి రేపు ఉదయం కల్లా నాకు చెప్పు అని అంటాడు. అప్పుడు వసు చేయు పట్టుకున్న రిషి 10000 రూపాయలు ఇచ్చి నీకు డబ్బా అవసరం ఉంది అని మేనేజర్ చెప్పాడు. అది ఎందుకో నాకు అనవసరం కానీ భవిష్యత్తులో దేనికి డబ్బు అవసరమైన నన్నే అడగాలి అని చెబుతారు.
Guppedantha Manasu Aug 22 Today Episode : సాక్షికి బుద్ధిచెప్పిన వసుధార..
ఇంకెప్పుడు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు డబ్బు తిరిగి మేనేజర్ కి ఇచ్చేయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. మరుసటి రోజు ఉదయం రిసీ కాఫీ తాగుతూ వసదారకి ఫోన్ చేద్దామా అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే గౌతమ్ అక్కడికి వస్తాడు. ఆ సమయంలో వసు,రిషికి ఫోన్ చేయగా గౌతమ్ ఫోన్ లాక్కొని మాట్లాడుతాడు. అప్పుడు గౌతమ్ ఏంటి వసు కింద హాల్లో ఉన్నావా అనడంతో రిషి అక్కడికి వెళ్తాడు.
మరోవైపు కింద వసునీ చూడగానే ధరణి వెళ్లి ప్రేమగా పలకరించడంతో ధరణిపై కోప్పడి అక్కడి నుంచి పంపిస్తుంది దేవయాని. అప్పుడు వసుధారనీ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.అప్పుడు రిషి,దేవయానినీ అక్కడి నుంచి పంపించి వసుతో కూడా మాట్లాడి వసు నీ కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మహేంద్ర జగతి ఇద్దరు రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.
మరొకవైపు వసు కాలేజీకి వెళ్తూ ఉండగా మధ్యలో సాక్షి అడ్డుపడి వసుని కాస్త వెటకారంగా మాట్లాడించడంతో వసు సాక్షికి తగిన విధంగా బుద్ధిచెప్పి ఎక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాలేజీకి వెళ్లిన వసు,రిషి కార్ ని చూసే రిషి తో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకొని రిషి గురించి మాట్లాడుతూ ఉండడంతో ఆ మాటలన్నీ రిషి వింటాడు. రేపటి ఎపిసోడ్ లో గౌతమ్ వసు ప్రేమ గురించి రిషి తో మాట్లాడడానికి ఏది జరగాలి అని ఉంటే అది జరుగుతుంది అని అంటాడు. ఆ తర్వాత వసుధర అమ్మవారి దగ్గరికి వెళ్ళి రిషి సార్ ని నా నుంచి దూరం చేయొద్దు అని అంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.
Read Also : Guppedantha Manasu: మళ్లీ ఒక్కటైన దేవయాని సాక్షి.. వసు గురించి ఆలోచనలో పడ్డ రిషి..?