Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటే దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ తో మాట్లాడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో తులసి, సామ్రాట్ తో మాట్లాడుతూ మీరు పైల్స్ కోసమే వచ్చారా లేక దేనికోసం వచ్చారు అని అడుగుతుంది తులసి. అప్పుడు సామ్రాట్ ఫైల్స్ కోసం వచ్చాను అని అనటంతో ఇవి అంత ముఖ్యమైన ఫైల్స్ కావు కదా ఈ ఫైల్స్ కోసం మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా లేదు కదా అని అంటుంది తులసి.
దాంతో సామ్రాట్ ఏం చెప్పాలా అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ మనసులో నిజానికి ఫైల్స్ కోసం రాలేదు అసలు విషయం చెబుదాము అనుకుంటే అనసూయ గారు అడ్డు వేశారు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి సామ్రాట్ ని ఇంట్లోకి ఆహ్వానించగా సామ్రాట్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండడంతో పరవాలేదు మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం అని తులసి లోపలికి రమ్మని పిలుస్తుంది.
సామ్రాట్ మాత్రం తులసి తో మాటడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ అయిస్తాన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు తులసి బతుకమ్మ సంబరాలకు హనీ అని పిలుచుకొని రమ్మని చెప్పగా నాకు పని ఉంది అని చెప్పి సామ్రాట్ కావాలనే తప్పించుకుంటాడు. మరొకవైపు లాస్య జరిగిన విషయాల గురించి తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.
ఆ సామ్రాట్ తులసిని ఉద్యోగంలో నుంచి తీసేసినప్పుడు అనసూయ ఎందుకు మౌనంగా ఉంది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన అనసూయను తన వైపుకు తిప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే అనసూయ కి ఫోన్ చేయడంతో ఇప్పుడు అనసూయ ఫోన్ లిఫ్ట్ చేసి లాస్యను వెటకారంగా మాట్లాడిస్తుంది.
ఆ తర్వాత లాస్య, అసూయతో దొంగ మాటలు మాట్లాడి అనసూయతో కూల్ గా మాట్లాడించే విధంగా చేస్తుంది. అత్తయ్య గారు మీ ఆశీర్వాదం వల్లే నందు ఒక ఉద్యోగం వచ్చింది అందుకే నందు మీకోసం పూజ చేయిస్తున్నారు అంటూ లేనిపోని అబద్ధాలు చెప్పి అనసూయ మనసు మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు లాస్య ని అనసూయ రమ్మని పిలుస్తుంది.
Intinti Gruhalakshmi:
మరోవైపు తులసి ఇంట్లో అందరూ సరదాగా కనిపిస్తారు. అప్పుడు తులసి బతుకమ్మను చేస్తూ బతుకమ్మ యొక్క గొప్పతనం గురించి అందరికీ వివరిస్తుంది. ఇక మరింత రోజు ఉదయం హనీ తులసి ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ సామ్రాట్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి కుటుంబం అందరూ కలిసి బతుకమ్మ జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. ఇంతలోనే అక్కడికి లాస్య దంపతులు కూడా వస్తారు.