Electricity Bill: ఇటీవల విద్యుత్ ఛార్జీలను పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ ధరలతో అవస్థలు పడుతున్న సామాన్యులకు కరెంట్ ఛార్జీలు పెరగడం మరింత కష్టాలను తెచ్చింది. చాలా మంది మధ్య తరగతి ప్రజలు కరెంటు బిల్లు కట్టలేక చాలా సమస్యలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎలాంటి చీటింగ్ చేయకుండా సగానికి సగం కరెంట్ బిల్లు తగ్గించుకోవడం ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో గీజర్ వాడడం వల్ల చాలా విద్యుత్ ఖర్చు అవుతుంది. కాబట్టి విద్యుత్ ను ఆదా చేసేందుకు గీజర్ బదులుగా వేరే ఆప్షన్ ను వెతుక్కోవాలి. గ్యాస్ పవర్డ్ గీజర్ ఉత్తమ ఎంపిక గ్యాస్ గీజర్ లాగా పనిచేస్తుంది. విద్యుత్ కూడా ఆదా అవుతుంది. నాన్-ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్ ఇంట్లో అద్యధికంగా విద్యుత్ వినియోగించే పరికరాల్లో ఏసీ ఒకటి. అయితే మీరు దాన్ని ఇంటి నుండి తీసేయలేరు. అలాంటి పరిస్థితుల్లో విద్యుత్ ను ఆదా చేసేందుకు నాన్ ఇన్వర్టర్ ఏసీకీ బదులుగా ఇన్వర్టర్ ఏసీని ఉపయోగించవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే లైట్లు, ఫ్యాన్లు వేస్కోవడం చేయాలి. గదిలోనుంచి కాసేప బయటకు వచ్చినా ఆఫేస్తూ.. విద్యుత్ ను ఆధా చేస్కోవాలి.