Horoscope : ప్రధాన గ్రహాలైన రాహు, కేతు, శని, గురు గ్రహాల వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారంలో అనేక ఇబ్బందులు కల్గుతాయి. అయితే ఆ రాశులు ఏంటి, వారు ఆ సమస్యల నుంచి ఎలా తప్పించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మకర రాశి.. మకర రాశి వాళ్లు మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా శ్రమ పెరగకుండా చూస్కోవాలి. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఇస్తాయి. దైవారాధన మానవద్దు.
మీన రాశి… మీన రాశి వాళ్లకు ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిరబుద్దితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీల విషయంలోల నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
Read Also :Horoscope : ఈ రెండు రాశుల వాళ్లకి ఈరోజంతా మంచే.. అదృష్టవంతులు!