Gold Schemes : బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే చేతిలో సరిపడా డబ్బులు లేవా.. అయితే బాధపకండి. మీరు చిన్న చిన్న మొత్తంతోనే భారీగా బంగారం కొనే ప్లాన్ మేం చెప్తాం. కాకపోతే దీని కోసం ఎక్కువ కాలం వేచి చూడాలి మరి. అప్పుడే ఒకేసారి ఎక్కువ మొత్తంలో బంగారం లభిస్తుంది. ఎలా అని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ మూడు గోల్డ్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాల్సిందే.
Gold Schemes
జ్యువెల్లర్స్ స్పెషల్ స్కీమ్… అందుబాటులో ఉంటాయి. మీరు వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత ఏడాది బంగారం కొనాలనుకుంటే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మీరు ఎంచుకున్న చెన్యూర్ వరకు డబ్బులు పెట్టాలి. తర్వాత మీరు మీ డబ్బులతో బంగారం కొనొచ్చు. ఇలా చేయడం వల్ల తయారీ చార్జీల్లో తగ్గింపు, క్యాష్ బాక్ వంటి బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఇంకా కొన్ని సంస్థలు 11 నెలలు మీరు డబ్బు చెల్లిస్తే… ఒక నెల డబ్బులు వారు చెల్లిస్తారు. అయితే మీరు ఇక్కడ రిస్క్ ఉంటుందని గుర్తించాలి. అందుకే పెద్ద పెద్ద జువెల్లరీ సంస్థల్లోని స్కీమ్స్ ను ఎంచుకోవడం ఉత్తమం. చిన్న చిన్న జువెల్లర్స్ బోర్డు తిప్పేస్తే నష్టపోవాల్సి వస్తుంది.
గోల్డ్ బాండ్ అనే మరో స్కీమ్ ఉంది. మీరు మీ పిల్లల పేరుపై బంగారాన్ని ఉంచాలని భావిస్తే.. ఈ స్కీమ్ అనువుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. అందువల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. రిస్క్ ఉండదు. గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాలం 8 ఏళ్లు. మీరు ఈ స్కీమ్ కింద 1 గ్రాము బంగారం కొనుగోలు చేయొచ్చు. మీకు ఈ గోల్డ్ బాండ్లపై 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. బ్యాంకులు లేదా స్టాక్ ఎక్స్చేంజీలు లేదా ఆన్ లైన్ లో గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు.
డిజిటల్ గోల్డ్ అనే మరో ఆఫ్షన్ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. అలాగే విక్రయించొచ్చు. ఫోన్ పే, పేటీఎం వంటి వాటి ద్వారా కూడా డిజిటల్ రూపంలో బంగారం కొనొచ్చు. మీ వద్ద డబ్బులు ఉన్నప్పుడు లేదంటే ప్రతి నెలా కొంత మొత్తానికి డిజిటల్ గోల్డ్ కొంటూ వెళ్తే.. దీర్ఘ కాలంలో భారీగా బంగారం సమకూర్చుకోవచ్చు. బంగారం కొనాలంటే బంగారం, డబ్బులు కావాలంటే డబ్బులు.. మీకు నచ్చింది తీసుకోవచ్చు.
Read Also : Gold prices today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?