Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో కార్తీక్, దీప ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య ఆటోలు వెళుతూ ఉండగా అది చూసి దీప, సౌర్య అని గట్టిగా పిలుస్తున్నా కూడా వినిపించుకోదు. ఇప్పుడు పక్కనే ఉన్న కార్తీక్ సౌర్య ఎక్కడ అనేకగా అదిగో డాక్టర్ బాబు ఆ ఆటోలో వెళుతుంది నేను కళ్లారా చూశాను అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సౌర్య వాళ్ళ ఆటోని ఫాలో అవుతారు. అప్పుడు దీప కార్తీక్ ఇద్దరు కారులో టెన్షన్ పడుతూ సౌర్య వాళ్ళ ఆటో ని ఫాలో అవుతూ వెళ్తారు.
అప్పుడు దీప కార్తీక్ ఇన్ని రోజులు సౌర్య కాదా అని అనుమానంతో ఉన్నాను ఈరోజు స్పష్టంగా తెలిసిపోయింది పాపం సౌర్య మన కోసం ఇక్కడే వెతుక్కుంటూ ఉంది అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఇప్పటికే చాలాసార్లు సౌర్య ని కలిసి అవకాశం వచ్చినా నేను ఎవడిని గుర్తుపట్టలేదు డాక్టర్ బాబు అంటూ ఎమోషనల్ అవుతూ ఉండగా ఏం కాదులే దీప వెళుతున్నాను కదా ఏడవద్దు అని ధైర్యం చెబుతాడు కార్తీక్.
వెళ్ళిన తర్వాత శౌర్య వాళ్ళ ఆటో కనిపించదు. దాంతో దీప ఇన్ని రోజులు కనపడలేదు అని బాధపడ్డాడు ఈ రోజు కనిపించిన కూడా పట్టుకోలేకపోయాను అని బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు కాఫీ షాప్ లో మోనిత కూర్చుని ఉండగా ఇంతలోనే అక్కడికి వాణి అనే ఒక అమ్మాయిని కావేరి పంపిస్తుంది. ఇక అక్కడికి వచ్చిన వాల్తేరు వాణి అనే అమ్మాయి మోనిత ముందు ఫోజులు కొడుతూ ఉండగా సరేలే అనే మోనిత కూర్చోబెట్టి దీపను దుర్గను చంపేయడానికి ప్లాన్ చెబుతూ ఉంటుంది.
అప్పుడు వాణి తో బిల్డప్ బాగానే ఉంది ఏ పనిలో ఏదైనా తేడా వస్తే అప్పుడు చెప్తాను అనటంతో ఏం కాదు మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దీప కార్తీక్ లో సౌర్య కనిపించలేదు అని నిరాశతో ఇంటికి వస్తారు. అప్పుడు కార్తీక్ తనకు గతం గుర్తులేదు అన్నట్టుగానే సౌందర్య వాళ్ళ గురించి ఎంక్వయిరీ చేస్తూ అడుగుతూ ఉంటాడు.
మరోవైపు వాణి తన ఫోన్లో కార్తీక్ దీప దుర్గల ఫోటోలను చూసి నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళు ఇంటికి వెళ్ళగా మోనిత నా మొగుని ఎక్కడికి తీసుకెళ్లావే అంటూ దీపపై సీరియస్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈరోజు నువ్వు నా చేతిలో అయిపోయావే అని దీప నువ్వు కొట్టడానికి పోతూ ఉండగా ఇంతలో వాణి అక్కడికి వచ్చి మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది.
దాంతో అసలు విషయం అర్థం కాక షాక్ అవుతుంది. ఇదేంటిది ఇంకొక రూట్ లో వస్తుందా ఎలా వచ్చినా పర్లేదులే నాకు పని జరగడం కావాలి అని మనసులో అనుకుంటుంది మోనిత.. అప్పుడు వాణి ఇది నా బొటిక్ ని నాశనం చేసిన దీని వల్ల 20 లక్షలు నష్టపోయాను ఈ దీప కార్తీక్ సార్లను ఎలా అయినా కలిపి తీరుతాను అంటూ మోనిత తో ఛాలెంజ్ చేస్తుంది.
ఆ తర్వాత మోనిత కార్తీక్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే అక్కడికి దుర్గ వస్తాడు. అప్పుడు వాణి దుర్గ వైపు చూస్తే నువ్వే నా దుర్గా అంటే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దీప ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్లి అక్కడే ఉండమని చెబుతుంది. మరొకవైపు శౌర్య తన అమ్మానాన్నల గురించి తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఇంద్రుడు వచ్చి సౌర్యని ఓదారుస్తాడు.