Reethu choudary: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె అంతకంటే కొన్ని ముందే కొన్ని సీరియల్స్ కొన్ని సీరియల్స్ నటించింది కానీ ఆమెకు జబర్దస్త్ ద్వారా క్రేజ్ కంటే అప్పటి క్రేజ్ తక్కువ అనే చెప్పాలి. అయితే తాజాగా ఈటీవీ ప్రసారం చేస్తున్న ఒక స్పెషల్ ప్రోగ్రాంలో రీతూ చౌదరి ఎమోషనల్ అయింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇంటిగట్టు అనే సీరియల్ ద్వారా రీతు చౌదరి నంచి పేరు సంపాదించింది. జీ తెలుగులో ప్రసారం అయిన జీ తెలుగులో ఈ సీరియల్ కు మంచి పేరు రాకపోయినా అందులో రీతూ చౌదరి పాత్రకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత జబర్దస్త్ లో అవకాశాలు దక్కాయి. ఈ మధ్య కాలంలో కొన్ని హాట్ ఫొటోలు ఉన్న సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్న ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను కూడా పరిచయం చేసింది. ఆయన పేరు శ్రీకాంత్ అని, పొలిటికల్ లీడర్ అని కూడా ప్రచారాలు జరిగాయి.
ఈటీవీలో ప్రసారం కాబోతున్న హలో బ్రదర్ అనే ఒక రాఖీ స్పెషల్ ఈవెంట్లో భాగంగా కంటెస్టెంట్ల అన్నా, చెల్లెల్లను తీసుకొచ్చారు. అందులో భాగంగానే రీతూ చౌదరి వంతు రాగా తనకు ఒక అన్నయ్య ఉన్నాడు కానీ ఆయనకు రాఖఈ కట్టే అవకాశం లేదని చెప్పి బాధపడుతుంది. ఇక్కడ ఉండడం ఆయనకు ఇష్టం లేదంటూ ఎమోషనల్ అయింది. కానీ సడెన్ గా వాళ్ల అన్నయ్య.. అమ్ములూ అంటూ స్టేజీపైకి వచ్చి ఆమెను హగ్ చేస్కుంటాడు. ఇలా అన్నయ్యని చూసి కన్నీళ్లు ఆపుకోలేని ఆమె స్టేజీపైనే ఏడ్చేస్తుంది.