Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామచంద్ర, జానకి ఇద్దరు కలిసి అలా తిరగడానికి బయటకు వెళ్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి, రామచంద్ర సెల్ఫీలు దూద్ ఉండగా ఇంతలో అక్కడికి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ ఫోటోలు దిగి నందుకు 5000 రూపాయలు కట్టండి అంటూ వారిని బెదిరిస్తాడు. అప్పుడు అతని ప్రవర్తనలో తేడా గమనించిన జానకి ఏ సరిపడా మీతో పాటు నేను పోలీస్ స్టేషన్ కి వస్తాము అనడంతో దెబ్బకి ఆ దొంగ పోలీస్ అక్కడినుంచి పారిపోతాడు.
అప్పుడు జానకి ని చూసి రామచంద్ర మెచ్చుకుంటారు. ఆ తర్వాత రామచంద్ర మొదటి విడత గెలిచినందుకు గోవిందరాజు ఆనంద పడుతూ ఉంటాడు. ఇంతలో మళ్లీక జానకి, రామచంద్ర గురించి ఊర్లో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడుకుంటున్నారు అని అనగా అప్పుడు గోవిందరాజు ఫోన్ కట్ చేసాడు.
మరొకవైపు జానకి దంపతులు చార్మినార్ దగ్గరికి వెళ్లి అక్కడ ప్రదేశాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు జానకి చుట్టు వైపుల చూస్తూ ఉండగా ఇంతలో అక్కడినుంచి జానకి కోసం గాజులు తేవడానికి వెళ్తాడు. అప్పుడు రామచంద్ర కనిపించకపోయేసరికి జానకి ఎమోషనల్ అవుతుంది.
ఎంత వెతికినా కనిపించకపోయేసరికి బాధ పడుతూ ఉండగా ఇంతలో రామచంద్ర వచ్చి భుజం మీద చెయ్యి వేసేసరికి జానకి కోపంతో కొడుతుంది. తర్వాత మీరు ఎక్కడికి వెళ్లారు అని టెన్షన్ పడ్డాను అని చెప్పి రామచంద్రను కౌగిలించుకొని ఏడుస్తుంది. మరొక వైపు చెఫ్ కాంపిటీషన్ రెండో రౌండ్ కు జడ్జీలుగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్, సంజయ్ వస్తారు.
అప్పుడు సంజయ్ మాట్లాడుతూ మనం చేసిన వంటలు అవతలవారు తిని వారెవా అనాలి అని అక్కడున్న వారిని ఎంకరేజ్ చేస్తారు. ఇక రెండవ రౌండ్ లో వెస్టర్న్ ఫుడ్ టాస్క్ ఇవ్వగా రామచంద్ర టెన్షన్ పడతారు. అదంతా చూసిన గోవిందరాజు దంపతులు కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటారు.
రేపటి ఎపిసోడ్ లో రామచంద్ర చేసిన ఒక వంటను జడ్జి ఇంకా పూర్తికాలేదు అని చెప్పడంతో కాస్త నిరాశ గా ఫీల్ అవుతాడు. అప్పుడు రామచంద్ర నాకు ఇటువంటి వంటలు రావు అనగా ఇలాంటి కాంపిటీషన్ లకు వచ్చినప్పుడు అన్ని రకాల వంటల్లో పట్టు ఉండాలి అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.