Rakul preeth singh : రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీ ఎంత క్లోజ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఈ ఇద్దరి సాన్నిహిత్యం చూసి అందరూ ముక్కున వేలేస్కుంటారు. కొన్ని సందర్భాల్లో వీరు షేర్ చేసే ఫొటోలను చూసి అందరూ తేడా కామెంట్లు కూడా చేస్తుంటారు. మంచు లక్ష్మీ, రకుల్ బంధం మీద రకరకాల ట్రోల్స్, మీమ్స్ వస్తుంటాయి. ఆ మధ్య బర్త్ డే పార్టీలో షేర్ చేసిన వీడియోలు, ఫొటోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు లక్షఅమీని రకుల్ వెనకాల నుంచి వాటేస్కోవడం, ఇద్దరూ హత్తుకున్న స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

అయితే ప్రస్తుతం రకుల్ హైదరాబాద్ లోనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న మంచు లక్ష్మీ ఆమెను కలిసేందుకు ఇంటికి వెళ్లింది. ఇక ఇద్దరూ కలిసి చేసిన రీల్ వీడియో వైరల్ కాసాగింది. ఇందులో రకుల్, మంచు లక్ష్మీ వేసిన స్టెప్పులు బాగా ట్రెండ్ అవుతున్నాయి. పంజాబీ పాటలకు మంచు లక్ష్మీతో కలిసి రకుల్ స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ మూమెంట్స్ మీద జనాలు కామెంట్లు చేస్తున్నారు.
Read Also : Rakul Preeth Singh : ప్రేమ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రకుల్.. మనశ్శాంతి దూరం అవుతుందంటూ కామెంట్స్!