pratap pothen: వరుస విషాదాలు సినీ పరిశ్రమను ముంచెత్తుతున్న వేళ.. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, ఆకలి రాజ్యం ఫేమ్, సీనియర్ హీరో రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. రెండు పెళ్లిళ్లు చేస్కున్నా చివరకు ఆయన ఒంటరిగా ఉండగానే కన్ను మూశారు. ప్రతాప్ పోతెన్ మరణ వార్త తెలుగు, తమిళ పరిశ్రమ షాక్ కి గురైంది. ప్రతాప్ పోతెన్ మలయాళ నటుడే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేశారు. సీనియర్ హీరోయిన్, ప్రముఖ నటి రాధికను మెదటగా పెళ్లి చేస్కుంది ఇతనే. 1985లో పెళ్లి చేస్కున్న వీరిద్దరూ 86లోనే విడిపోయారు.
రాధికతో విడాకుల తర్వాత ప్రతాప్ పోతెన్ నాలుగేళ్లు ఒంటరిగానే ఉన్నాడు ఆ తర్వాత అమల సత్యనాథ్ ను 1990లో పెళ్లి చేస్కున్నాడు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. 2012లో అమలకు కూడా విడాకులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే జీవిస్తున్నారు. రాధిక చాలా మంచిదని.. విడాకులకు ప్రత్యేకమైన కారణలేం లేవని ఆయన వివరించారు. పెళ్లి అనేది అందరి జీవితానికి సరిపడేది కాదన్నారు. అది ఇద్దరి ఆలోచనలను బట్టి ఉంటుందని గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.