Balakrishna indian idol : బాలయ్య అన్ స్టాపబుల్ ప్రోగ్రాంతో తనలో ఉన్న మరో టాలెంట్ ని ప్రజలకు పరిచయం చేశాడు నందమూరి బాలకృష్ణ. ఆయన యాంకర్ గా ఎలా చేస్తారని భయపడ్డ వారికి తన ప్రోగ్రామ్ తోనే సమాధానం చెప్పారు. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులంతా వేచి చూస్తున్నారు. ఈ తరుణంలోనే బాలకృష్ణ మళ్లీ ఆహాలో మెరిశారు. ఆహా ఓటీటీలో ప్రాసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ లో గెస్టుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ప్రోగ్రాం జూన్ 10వ తేదీ రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.
అయితే ఇందుకు సంబంధించిన ఓ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో బాలయ్య ఫుల్ ఎనర్జీతో కనిపించారు. అన్ స్టాపబుల్ కి ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వన్ మ్యాన్ షో చేసేస్తున్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ పవర్ ఫుల్ పంచులు వేస్తూ ఫల్ కామెడీ చేశారు. అయితే ఎంట్రీలో సింహమంటి చిన్నోడే వేటొకొచ్చాడే పాటకు స్టెప్పులు వేసి అందర్నీ అలరించారు. తాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చానని తెలిపారు. ఆ తర్వాత టాప్ 6కి చేరిన కంటెంస్టెంట్… అఖండ టైటిల్ సాంగ్ పాడటంతో లేచి చప్పట్లు కొట్టారు.
అయితే ఈ సింగర్ కు త్వరలో పెళ్లీ పీటలు ఎఖ్కబోతున్నారట. అయితే పెళ్లి ఎప్పుడు అని అడగను.. ఎందుకయ్యా పెళ్లి అని మాత్రమే అడుగుతానంటూ చమత్కరించారు. నందమూరి బాలకృష్ణ రాసిన? భార్యని ఏమార్చడం ఎలా? 30 సూత్రాలు” అనే పుస్తకాన్ని సింగర్ కు అందించారు. ఆ తర్వాత ఫుల్ పంచులు వేస్తూ… కామెడీ చేశారు.
Read Also : SP Balasubrahmanyam: బాలుకి ప్రేమతో.. జయంతి సందర్భంగా వందమంది సింగర్లతో నీరాజనం!