Mega Star Fans Trolls on Umair Sandhu for Bad Review on Chiranjeevi God Father
God Father First Review : సినిమాలకు రిలీజ్‌కు ముందుగానే రివ్యూలు ఇవ్వడం కామన్. ట్విట్టర్ రివ్యూలు.. ఫస్ట్ రివ్యూలని.. ఇలా ఇచ్చినప్పుడు మూవీపై నెగెటివ్ టాక్ లేదా పాజిటివ్ టాక్ వినిపిస్తుంటుంది. ఏ సినిమా రిలీజ్ అయినా అంతకంటే ముందే ఫస్ట్ రివ్యూలు ఇచ్చేస్తుంటారు. అందులో ముందుండేది ఉమైర్ సంధు (Umair Sandhu). తాను ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌గా చెప్పుకునే ఈయన ఫేక్ రివ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాడు. అందరీ కన్నా ముందే తాను సినిమాలు చూశానంటూ.. ట్విట్టర్‌లో రివ్యూలు ఇస్తుంటాడు.
అలా ఉమైర్ సంధు అనే వ్యక్తి తన ఫేక్ ట్వీట్లతో పాపులర్ అయిపోయాడు. గతంలో రిలీజ్ అయిన ఆచార్య, రాధేశ్యామ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, స్పైడర్, సాహో, నాపేరు సూర్య, బీస్ట్ వంటి మూవీలపై కూడా ట్విట్టర్ రివ్యూలు ఇచ్చేశాడు. అయితే ఈ మూవీలన్నీ తాను చూశానంటూ రేటింగ్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా మెగాస్టార్ మూవీ గాడ్ ఫాదర్ రిలీజ్ కాకముందే ఫస్ట్ రివ్యూ అంటూ ఇచ్చేశాడు ఉమైర్ సంధు.
అక్టోబర్ 5న చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని తాను ముందే చూశానంటూ సంధు ట్వీట్ చేశాడు. ఎప్పుడు మూవీలకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చే ఉమైర్ సంధు.. గాడ్ ఫాదర్ మూవీకి బ్యాడ్ రివ్యూ ఇచ్చేశాడు. తన రివ్యూలో ‘మీరు విశ్రాంతి తీసుకోండి ప్లీజ్.. చిరంజీవికి సాలిడ్ స్క్రిప్ట్స్ కావాలి. ఇలాంటి హీరోయిజం, మాస్ పాత్రల నుంచి ఇకనైనా బయటపడండి. తెలివితక్కువ స్క్రిప్ట్‌లతో టాలెంట్‌ను వేస్ట్ చేసుకోవద్దు.. మీరు మెగాస్టార్.. కానీ, స్క్రిప్ట్ బాగాలేదు. గాడ్ ఫాదర్ యావరేజ్’ అంటూ ట్వీట్ చేశాడు.
గాడ్ ఫాదర్ రిలీజ్ కాకముందే.. సెన్సార్ బోర్డు రివ్యూ అంటూ ఉమైర్ సంధు ఫేక్ రివ్యూతో నెగిటివ్ ప్రచారానికి తెరలేపాడు. అంతే.. మెగా ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. సినిమాలు రిలీజ్ కాకముందే మూవీ రివ్యూలు ఎలా ఇస్తారంటూ సంధును ఏకిపారేశారు. నీ ఫేక్ రివ్యూలు ఆపేయ్.. వీడి రివ్యూలను ఎవరూ నమ్మొద్దు అంటూ మెగా ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు.
ఉమైర్ సంధుపై ‘సందులో పంది.. బురదలో ఉంది’ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ ముందే చూశానన్నావు.. సూపర్ అన్నావు.. బ్లాక్‌బస్టర్ అన్నావు.. తీరా చూస్తే ఏమైంది.. నువ్వు చేసే రివ్యూలు అన్నీ ఫేక్.. ఇకనైనా ఫేక్ రివ్యూలు ఆపేయ్ అంటూ మెగా ఫ్యాన్స్ గట్టిగానే ఇచ్చిపడేశారు. మెగాస్టార్‌కి సలహాలు ఇచ్చేంత గొప్పవాడివా అంటూ తిట్టిపోస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీపై మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆచార్య డిజాస్టర్ తరువాత మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ హిట్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గాడ్ ఫాదర్ మూవీపై గట్టిగానే నమ్మకం పెట్టేసుకున్నారు. అక్టోబర్ 5న రిలీజ్ కానున్న గాడ్ ఫాదర్ మూవీ ఎలాంటి టాక్ అందుకుందో చూడాలి.
Read Also : Godfather: మూడు రాజధానులపై మెగాస్టార్ సెటైర్లు, జగన్ గురించేనా?
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.