Intinti Gruhalakshmi serial Oct 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి, ఝాన్సీ ని నిలదీస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి ఝాన్సీ ని నిజం చెప్పు ఝాన్సీ నువ్వే ఈ పని చేసావా లేకపోతే నీతో ఎవరైనా చేయించారా చెప్పు లేదంటే సామ్రాట్ గారికి నీ పేరు బయట పెట్టాల్సి వస్తుంది అని బెదిరించడంతో అప్పుడు ఝాన్సీ నేనే తప్పు చేశాను సామ్రాట్ గారి దగ్గరికి వెళ్దాము. ఈ తప్పు చేశాను అందుకే జాబ్ కి రిజైన్ చేస్తున్నాను అని అంటుంది ఝాన్సీ. దాంతో తులసి కోపంగా అక్కడి నుంచి వెళ్లి తన క్యాబిన్లో కూర్చుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వస్తాడు.
సామ్రాట్ నేను తిట్టినందుకు బాధపడుతున్నావా తులసి వాడి గురించి పట్టించుకోవద్దు కోపం వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు అన్న పట్టించుకోకుండా తిడుతూ ఉంటారు అని చెబుతాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. ఆ తర్వాత సామ్రాట్ దగ్గరికి ఝాన్సీ వెళ్లి స్వారీ సార్ నేను ఈ జాబు కీ రిజైన్ చేస్తున్నాను అనటంతో సామ్రాట్ పేపర్ ని చింపి పారేస్తాడు. ఇప్పుడు ఝాన్సీ తప్పు చేసినందుకు నాకు ఎలాగో గిల్టీ గా ఉంది సార్ అని అనడంతో నువ్వు కాదు కదా ఝాన్సీ తప్పు చేసింది నేను అనే బాధపడుతూ ఉంటాడు సామ్రాట్.
అప్పుడు ఎందుకు సార్ ఆ విధంగా చేశారు అని అనగా సామ్రాట్ ఎం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత బర్త్డే పార్టీ మొదలవడంతో వచ్చిన గెస్ట్ లను రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు సామ్రాట్. ఇంటిలోనే వాళ్ళ బాబాయ్ వచ్చి ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అనటంతో సామ్రాట్ గెస్ట్ ల కోసం అని చెబుతాడు. ఇక అనుకున్న విధంగానే అక్కడికి తులసి వాళ్ళ కుటుంబం రావడంతో సామ్రాట్ ఊపిరి పీల్చుకుంటాడు.. వెనకాలే నందు వాళ్లు కూడా వస్తారు. అప్పుడు లాస్య, నందు తో తులసి గురించి లేనిపోని కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
అప్పుడు దివ్య నాకోసం ఎదురు చూస్తున్నారా అని అనగా అవును నీకోసమే ఎదురు చూస్తున్నాము. మా హనీ తులసి లేకపోతే రెడీ అవ్వను అని అంటుంది అని అంటాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్. ఆ తర్వాత తులసి హనీ దగ్గరికి వెళుతుంది. అప్పుడు నందు పరంధామయ్యను పలకరించడంతో పరంధామయ్య మాట్లాడడు. దాంతో నందు అంత తప్పు నేనేం చేశాను నాన్న అని అనగా వెంటనే పరంధామయ్య అయిపోతుంది కదా అని ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోను అని అనడంతో వెంటనే లాస్య తులసిని తెప్పి పొడిచే విధంగా మాట్లాడడంతో అనసూయ స్ట్రాంగ్ గా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
మరొకవైపు తులసి, హనీ నీ రెడీ చేసి మురిసిపోతూ ఉండగా సామ్రాట్ అక్కడ నిలబడి చూసి నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ లోపలికి వచ్చి మాట్లాడిస్తూ ఉండగా ఇంతలోనే సామ్రాట్ ని మళ్ళీ లోపలికి పిలుస్తాడు వాళ్ళ బాబాయ్. అప్పుడు సామ్రాట్ నవ్వుతూ ఉండగా ఇంతలోనే చెప్పిన మాటలు గుర్తుతెచ్చుకొని నేను మంచి గౌను తెచ్చాను అమ్మ అది వేసుకో అని అంటాడు. అప్పుడు హనీ అదేంటి డాడీ ఇప్పుడే కదా అడ్రస్ బాగుంది అన్నావు మళ్లీ ఇప్పుడు ఇది వేసుకోమంటున్నావు అని అనడంతో సామ్రాట్ సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత అనసూయ నేను చెప్పిన విషయం గురించి ఏం చేశారు సామ్రాట్ అని సామ్రాట్ నిలదీస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో నందు హనీ బర్త్డే పార్టీలో తులసిని మేనేజర్ గా తీసేసి ఆ స్థానంలో సామ్రాట్ నందుని నియమిస్తున్నాను అని చెప్పడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు అవమానంగా భావించిన తులసి సామ్రాట్ కి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తులసి తో పాటు బర్త్డే పార్టీ నుంచి వాళ్ళ కుటుంబం అందరు వెళ్లిపోతారు.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.