Marriage Age : పూర్వకాలంలో అమ్మాయికి 18 ఏళ్లు అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లిళ్లు చేసేవారు. అయితే ప్రస్తుత కాలంలో మగవారితో పోటీగా ఆడవారు కూడా అన్ని విషయాలలో ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో మగవారితో సమానంగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తూ డబ్బు వేటలో పడి పెళ్లి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి కొంతమంది జీవితంలో బాగా స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకునే వారు ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్న వారికి ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా 20- 25 సంవత్సరాల మధ్య ఏ వ్యక్తికైనా తన గురించి తప్పితే కుటుంబం గురించి అంతా ఏకాగ్రత ఉండదు. తమకోసం, తమ కుటుంబం కోసం మాత్రమే మొత్తం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి వయసు 30 సంవత్సరాలు దాటిన తర్వాత వారి దృష్టి కేవలం వారి భవిష్యత్తు మీద ఉంటుంది అందువల్ల వారు ఎక్కువ సమయం సంపాదనలో పడి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. అందువల్ల 30 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకుంటే వారి ఏకాగ్రత కేవలం సంపాదన మీద మాత్రమే ఉంది.. వైవాహిక జీవితాన్ని పూర్తిగా అనుభవించలేరు.
Marriage Age : 30 ఏళ్లు పైబడిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చా?
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ సంపాదనలో పడటం వల్ల ఒకరి మీద ఒకరికి ఆకర్షణ తగ్గి వారి వైవాహిక జీవితం చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఇలా భార్యాభర్తలిద్దరూ పనిలో బిజీగా ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోలేక ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది భార్య భర్తలు వివాహం జరిగిన కొంతకాలానికి విడాకులు తీసుకుంటున్నారు.
అంతేకాకుండా 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే వారు వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ప్రస్తుత కాలాన్ని భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయలేక పోతారు. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గి వారి ఏకాగ్రత వేరొకరి మీదకు వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి అనుకునేవారు ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోండి.
Read Also : Big boss Himaja: హిమజ్ బెంజ్ కారు ధ్వంసం, సీసీటీవీ ఫుటేజీతో యువకుడికి చుక్కలు చపిస్తోందిగా!
Tufan9 Telugu News And Updates Breaking News All over World