Mangala Gauri Vratham 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం మనకు ఎన్నో ముఖ్యమైన పర్వదినాలు ముఖ్యమైన రోజులు వస్తుంటాయి. ఇలాంటి ముఖ్యమైన పర్వదినాలలో మంగళ గౌరీ వ్రతం ఒకటి.మంగళ గౌరీ వ్రతం రోజు పెద్ద ఎత్తున మహిళలు తమ భర్త దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రత్యేకంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో మంగళ గౌరీ వ్రతం చేయటం వల్ల తమ భర్త ప్రాణాలకు ఏ విధమైనటువంటి హాని ఉండదని భావిస్తారు. మరి ఈ ఏడాది మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు వచ్చింది.. ఈరోజు ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
ఈ ఏడాది మంగళ గౌరీ వ్రతం జూలై 26వ తేదీ వచ్చింది అయితే ఇదే రోజు తొలి శ్రావణ శివరాత్రి రావడం గమనార్హం. ఇకపోతే ప్రతి ఏడాది మంగళ గౌరీ వ్రతాన్ని స్త్రీలు శ్రావణ రెండో మంగళ గౌరీ వ్రతం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు జరుపుకుంటారు. ఇక ఈరోజు శివపార్వతులను పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు ఉంటాయని భావిస్తారు.శ్రావణ మాసం కృష్ణ పక్షం త్రయోదశి జూలై 26వ తేదీ సాయంత్రం 06.46 గంటల వరకు ఉంటుంది అనంతరం చతుర్దతి ప్రారంభమవుతుంది.ఇకపోతే మాస శివరాత్రి చతుర్థి రోజు వస్తుంది కనుక ఒకే రోజు మంగలి గౌరీ వ్రతం అలాగే మాస శివరాత్రి రావడం చేత ఈ రెండు వ్రతాలు చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం కలుగుతుంది.
ఇకపోతే జూలై 26వ తేదీ ముహూర్తం విషయానికి వస్తే..
అభిజిత్ ముహూర్తం: 26 మ. 12 నుండి 12:55 వరకు
రాహు కాలం: ఉ. 03:52 నుండి సా. 05:34 వరకు
భద్ర సమయం: సా06:46 గంటల నుండి జూలై 27 ఉ05:40 వరుకు.
శివరాత్రి ఆరాధనకు అనుకూల సమయం: మధ్యాహ్నం 12:07 నుండి 12:49 గంటల వరకు. ఇక మంగళ గౌరీ వ్రతం చేయడం ద్వారా మహిళలు అఖండమైన సౌభాగ్యాన్ని అందుకుంటారు. అలాగే ఈ వ్రతం ఆచరిస్తే సౌభాగ్యంతో పాటు పుత్ర సంతానం కూడా కలుగుతుంది. ఇక పెళ్లైన మహిళలు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలి.
Business Idea : ఆన్‌లైన్ కంటెంట్ క్రియేషన్ నుంచి అగరుబత్తుల తయారీ వరకు ఈ వ్యాపారాలు తక్కువ డబ్బుతో ప్రారంభమై…
Muharram School Holiday 2025 : జూలై 7, 2025, మొహర్రం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం (is tomorrow…
ICAI CA May 2025 Exam Toppers : ICAI CA మే 2025 రిజల్ట్స్ విడుదల అయ్యాయి. CA…
PM Kisan 20th Installment Date : PM కిసాన్ 20వ వాయిదాకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో పేరు లేని…
PF Balance Check : ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు SMS,…
Shortest Day : భూమి భ్రమణ వేగం పెరిగింది. రోజు 24 గంటలు కాదు.. చంద్రుడు, భూమి ఒక భాగంలో…
This website uses cookies.