MAA Elections 2021 Results : జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ‘మా ఎన్నికలు’ హోరాహోరీగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి క్షణానికో మార్పు చోటచేసుకుంటోంది. సభ్యుల మధ్య బాహాబాహీకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. నటీనటులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. నటి హేమ.. దూసుకెళ్లి శివబాలాజీ చేయి కొరికేసింది. శివబాలాజీ బయటకొచ్చి మీడియాకు హేమ కొరికిన తన చేయిని చూపించాడు.
శివబాలజీ తన చేతిని హేమ కొరికిందని మీడియాకు వెల్లడించిన నేపథ్యంలో హేమ క్లారిటీ ఇచ్చారు. ఏం చేయకుండానే కొరికేస్తామా.? అంటూ ఆమె స్పందించారు. ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా? అని ప్రశ్నించింది. ఎన్నికలు అయ్యాక ఏం జరిగిందో పూర్తి విషయాలు మాట్లాడుతానని ఆమె చెప్పుకొచ్చింది శివ బాలాజీ తనను అడ్డుకోవడం వల్లే కొరికాను అంటూ హేమ క్లారిటీ ఇచ్చింది.
కొన్ని ఉద్రిక్తత సంఘటనలు తప్ప మా ఎన్నికలు ప్రశాంతగానే కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలయ్యాయి. మా సభ్యులు మొత్తం 925 మంది ఉన్నారు. వారిలో 883 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి మొదలైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలవరకు జరగనున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
మా ఎన్నికల ఫలితాలను కూడా ఈరోజే ప్రకటించనున్నారు. సోమవారం ఫలితాలను ప్రకటించాలని భావించినప్పటికీ నిర్ణయం మార్చుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మా ఎన్నికల సమయంలో ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మీడియా ముందుకొచ్చారు. ప్రకాష్ రాజ్ భుజంపై చేయివేసి మంచు విష్ణు మాట్లాడారు. అంతా బాగానే ఉందని సంకేతాలిచ్చారు.
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.