Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ప్రోగ్రాం మంచి జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా మంచి ఎంటర్ టైన్మెంట్ జనరేట్ అవుతోంది. అయితో బిగ్ బాస్ లో ఎవరైననా వరస్ట్ పర్ఫార్మర్ అని ఇంటి సభ్యులతో అనిపించుకుని జైలుకు వెళ్లిన తర్వాత వాటి ఆట తీరు పూర్తిగా మారుతుంది. జైలుకు పంపించారన్న కసితో ఆట ఆడతారు. అగ్రెసివ్ ప్లేయర్ గా ఉంటారు. మెంటల్ టాస్క్ లు ఇచ్చినా, ఫిజికల్ టాస్క్ లు ఇచ్చినా విరుచుకుపడతారు.
అలాగే గత వారం వరస్ట్ పర్ఫార్మర్ గా అర్జున్ కల్యాణ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా గేమ్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ బుద్ధి మార్చుకుంటే అర్జున్ కల్యాణ్ ఎందుకు అవుతాడు. తన తీరులో ఎలాంటి మార్పు లేదు. మొదటి నుండి ఎలా ఉన్నాడో ఇప్పుడు అంతకు మించి దిగజారి పోయాడు. శ్రీసత్య ఎక్కడ కనిపిస్తే.. అక్కడక్కడే తిరుగుతూ కనిపిస్తాడు అర్జున్ కల్యాణ్.
నాలుగో వారం కెప్టెన్సీకోసం కీర్తి, శ్రీసత్య, సుదీప ముగ్గురు పోటీ పడ్డారు. నెంబర్ గేమ్ టాస్క్ లో కీర్తి ఆఖరి వరకు పోటీ పడి మరీ గెలిచి క్యాప్టెన్ అయింది. ఈ సీజన్ లో మొదటి మహిళా క్యాప్టెన్ గా రికార్డు సృష్టించింది కీర్తి. ఈ టాస్క్ లో తన వంతు కృషి చేసిన శ్రీసత్య అలసిపోయి కూర్చోగా.. మన కరవు కల్యాణ్ కల్యాణ్ ఆమె కాళ్లు నొక్కుతూ కూర్చున్నాడు. తర్వాత జరిగిన ఓటింగ్ లో వరస్ట్ పర్ఫార్మర్ గా నిలిచాడు. తర్వాత జైలులోని కెమెరాల ముందు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఆట ఏంటో చూపిస్తా అంటూ సవాళ్లు చేశాడు
Read Also : Bigg Boss season 6 telugu : శ్రీసత్య టచ్ కోసం కక్కుర్తి కల్యాణ్ ఆత్రం..