Karthika Deepam July 9 Today Episode : శోభ చెంప చెల్లుమనిపించిన జ్వాలా.. జ్వాలాకి సేవలు చేస్తున్న హిమ..?

Karthika Deepam July 9 Today Episode
Karthika Deepam July 9 Today Episode

Karthika Deepam July 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా హిమను కోపంతో బయటకు గెంటేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా ఇంద్రమ్మ ఒడిలో పడుకుని జరిగిన విషయాన్ని తెలుసుకుని కుమిలిపోతూ ఉండగా ఇంతలో ఇంద్రుడు జ్వాలమ్మ నిన్ను మేము జ్వాలా అని పిలవాలా లేకపోతే అని అంటూ ఉండగా వెంటనే నేను మీ జ్వాలానే బాబాయ్ మీరు కూడా నన్ను దూరం చేయాలనుకుంటున్నారా అని బాధపడుతుంది జ్వాలా.

Karthika Deepam July 9 Today Episode
Karthika Deepam July 9 Today Episode

ఆ తర్వాత ఇంద్రమ్మ అది కాదమ్మా మీ వాళ్ళు అంతలా బ్రతిమలాడుతున్నప్పుడు వెళ్ళవచ్చు కదా అని అనగా అప్పుడు జ్వాలా ఎటువంటి బంధం లేకుండా మీరు నన్ను చేరదీసి కన్న బిడ్డల పెంచారు. అటువంటిది మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎలా వెళ్తాను పిన్ని అని అంటుంది జ్వాల. అప్పుడు ఇందిరమ్మ ఎంత నచ్చి చెప్పడానికి ప్రయత్నించినా కూడా జ్వాల వినిపించుకోదు.

Advertisement

మరోవైపు స్వప్న వంట చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నిరుపమ్ వచ్చి, మమ్మీ మనం ఇంకా పెళ్లి పనులు మొదలు పెట్టలేదు అనడంతో స్వప్న ఒకరకంగా చూడడంతో ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు. పెళ్లి పనులు మొదలుపెడదాం, వంటలు అని అనడంతో అప్పుడు స్వప్న చిరాకుగా ఏదో ఒకటి చేద్దాంలే అని అంటుంది. కానీ నిరుపమ్ ఏదో ఒకటి కాదు మన ఇంట్లో జరుగుతున్న మొదటి ఫంక్షన్ కాబట్టి అన్ని రకాల వంటలు చేయాలి అని అంటాడు.

Karthika Deepam July 9 Today Episode : శౌర్యకి దగ్గరయ్యే ప్రయత్నంలో హిమ..

అప్పుడు స్వప్న ఈ పెళ్లికి అన్ని ఆర్భాటాలు అవసరమా అనడంతో అప్పుడు నిరుపమ్ అక్కడ నుంచి హర్ట్ అయ్యి, ఎలా అయినా నా హిమను నేను బతికించుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య ఆనంద్ రావులు హిమ,సౌర్యల గురించి తలచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆనంద్ రావు సౌర్యను తలుచుకొని బాధతో మరింత కుమిలిపోతూ ఉంటాడు. మరొకవైపు జ్వాల బయటకు వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా ఇంతలో ఇంద్రమ్మ అక్కడికి వచ్చి భోజనం చేయమని బ్రతిమలాడుతుంది. అప్పుడు ఇంద్రుడు సైలెంట్ గా ఉండకుండా దోసకాయ పచ్చడి తిని వెళ్లు అని అనడంతో అప్పుడు జ్వాలా వారిద్దరిపై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక తలుపులు తెరిచి చూడగా హిమ వర్షంలో నానుతూ అలాగే కనిపిస్తుంది.

Advertisement

అప్పుడు సౌర్య ఏంటి నువ్వు అప్పటినుంచి ఇలాగే ఉన్నావా ఎవర్ని సాధిద్దామని ఇక్కడే ఉన్నావు అని హిమపై సీరియస్ అవుతుంది. ఆ తరువాత హిమ చలిగా ఉంది లోపలికి వెళ్దాం పద అని అడగగా ఇక్కడికి కాదు డైరెక్టుగా మీ ఇంటికి వెళ్దాం పద అని చెప్పి హిమను కారు దగ్గరికి బలవంతంగా తీసుకొని వెళుతుంది. మీ ఇంటి అడ్రస్ చెప్పు అనడంతో హిమ మరింత బాధపడుతుంది. అప్పుడు జ్వాలా కారులో ఇంటికి వెళ్లే వరకు ఏమైనా మాట్లాడితే నేనక్కడి నుంచి దిగి వెళ్ళిపోతాను అని అంటుంది. మరొకవైపు స్వప్న శోభ ఇద్దరూ నిరుపమ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు శోభ నేను అప్పులు ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆలోచించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సౌర్య,హిమను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తుంది.

అప్పుడు హిమ లోపలికి రమ్మని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా శౌర్య రాను అని చెప్పి హిమపై సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో జ్వాలాతో శోభ మాట్లాడుతూ.. నువ్వే శౌర్య అన్న విషయం హిమకు బ్లడ్ క్యాంపు లోనే తెలుసు అని, అంతేకాకుండా మీ డాక్టర్ సాబ్ ఆ హిమ సొంతం చేసుకోవడం కోసం,తనకి క్యాన్సర్ అని 2 నెలలే బతుకుతాను అని నాటకం ఆడి పెళ్లి వరకు తీసుకువచ్చింది అనడంతో జ్వాల ఆ శోభ చెంప చెల్లుమనిపిస్తుంది.ఇక రేపటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Advertisement

Read Also : Karthika Deepam july 8 Today Episode : హిమను ఇంటి దగ్గర దిగబెట్టిన శౌర్య.. బాధతో కుమిలిపోతున్న ఆనందరావు..?

Advertisement