Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ, జానకికీ కుంకుమపువ్వు ఇచ్చి జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి కుంకుమ పువ్వు కలిపిన పాలను ఒకటి జెస్సికి ఇంకొకటి మల్లిక కోసం తయారు చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జెస్సి వస్తుంది. అప్పుడు జానక,జెస్సి నువ్వు ఇలాగే ఉంటే అత్తయ్య మీతో తొందర్లోనే మాట్లాడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది అని అంటుంది. అప్పుడు ఏం మాట్లాడుతున్నావో అక్క నిజంగానా అని అనగా అవును జెస్సి ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళని అత్తయ్య నీకోసం మల్లిక కోసం బయటకు వెళ్లి ఈ కుంకుమపువ్వు తెచ్చారు అనటంతో జెస్సి కుంకుమ పువ్వు కలిపిన పాలని తీసుకొని ఆనందంగా రూమ్ లోకి వెళుతుంది.
మరొకవైపు మల్లికా లీలావతికి ఫోన్ చేసి పెద్దమ్మ నా ప్లాన్ ఫెయిల్ అయింది అందుకోసం ఇంకొక ప్లాన్ ఆలోచిస్తున్నాను అంటూ మళ్ళీ మరొక కుట్ర చేయడానికి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి జానక వస్తుంది. అప్పుడు జానకి మల్లిక వైపు కోపంగా చూస్తూ ఉండగా ఏంటి జానకి అలా చూస్తున్నావు అని అనడంతో వెంటనే జానకి నువ్వు తప్పు చేస్తున్నావు మల్లిక
అని అనగా ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని మల్లిక అడగడంతో నువ్వు మాట్లాడిన మాటలు అన్నీ నేను విన్నాను మల్లిక.
ఉదయం నువ్వు జెస్సి ని కావాలనె అత్తయ్య గారు ముందు ఇరికించాలని చూసావు జెస్సి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది నువ్వే అని కూడా నేను పసిగట్టగలిగాను నీకు ముందే చెప్పాను మీ పద్ధతి మార్చుకోమని అంటూ మల్లికకు ఫుల్ గా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి. ఇప్పుడు మల్లిక ఇదేంటి నాకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది అని కోపంగా అనుకుంటూ ఏదో ఒకటి చేయాలి అని మళ్ళీ ప్లాన్ వేస్తుంది. మరొకవైపు జెస్సి రూమ్ లోకి వెళుతూ ఉండగా అఖిల్
ఈదురు పడటంతో వెంటనే జెస్సి, అఖిల్ నాకు ఈరోజు సంతోషంగా ఉందో తెలుసా, అత్తయ్య గారు నాకోసం కుంకుమపువ్వు తెచ్చారట అని అనటంతో, వెంటనే అఖిల్ నీకు అదే కదా కావాల్సింది జెసి నువ్వు అమ్మ కలిసిపోయి ఒక్కటయితే నేను ఇంట్లో ఏమైపోయినా పర్లేదు కదా అని అనడంతో ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అఖిల్ అని అంటుంది. వారిద్దరి మధ్య మాట పెరిగి అఖిల్ జెస్సీ చేతిలో ఉన్న గ్లాస్ ని విసిరి కొడతాడు.
అంత చూస్తున్న జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు అఖిల్ నీ జానకి పిలుస్తున్న అఖిల్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జానకి జెస్సి దగ్గరికి వచ్చి ఓదారుస్తుంది. అప్పుడు జానకి రూమ్ లోకి వెళ్ళగా రామచంద్ర తన చదువు విషయం గురించి బాధపడుతూ ఉంటాడు. వెంటనే జానకి రామచంద్ర ని చూసి చదువుకోవాలి అనే బుక్స్ తీసి చదువుతూ ఉండగా రామచంద్ర మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత జానకి చదువుతూ ఉండడంతో రామచంద్ర సంతోష పడుతూ ఉంటాడు..