Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు ఇద్దరూ వీడియో గురించి ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధారతో మాట్లాడుతూ ఆ వీడియోలో నువ్వు నన్ను అన్ని మాటలు అంటావా అని అడగగా అప్పుడు వసుధార అందులో తప్పేముంది సార్ కరెక్టే కదా అని అంటుంది వసు. నా నెంబర్ ని మీరు పొగరు అని సేవ్ చేసుకున్నారు కదా అని అడగగా వెంటనే రిషి మరి నువ్వు నా పేరు నీ ప్రిన్స్ అని సేవ్ చేసుకున్నావు కదా అదేంటి అని అడుగుతాడు రిషి. అప్పుడు అలా వారిద్దరూ వాదించుకుంటూ ఉండగా ఈమధ్య మాటకు మాట సమాధానం ఇస్తున్నావు.
ధైర్యం ఎక్కువైంది అని రిషి అనడంతో ప్రేమ ఉన్నచోట ధైర్యం ఉంటుంది సార్ అని అనగా వెంటనే రిషి మరి ఎందుకు ఆ విషయంలో మనకు విభేదాలు వస్తున్నాయి అని అనడంతో వెంటనే వసుధర ఆ మాట నేను కూడా అనగలను సార్ అని అంటుంది. అప్పుడు వసుధార ఆ టాపిక్ గురించి తీయడంతో వెంటనే రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మురుకవైపు ధరణి వంట చేస్తూ ఉండగా జగతి వెళ్లి సహాయం చేస్తూ ఉండడంతో ఇంతలో అక్కడికి ధరణి వస్తుంది.
అప్పుడు అనే నేను ఈ మాటలతో రెచ్చగొట్టడానికి వచ్చావా జగతి అని అనగా నేనెందుకు రెచ్చగొడతాను అక్కయ్య అని అనటంతో సరే ఇప్పటి నుంచి నువ్వు నేను స్నేహితురాలుగా ఉందాం అని అంటుంది దేవయాని. రిషి ని వసదారాన్ని దూరం చేసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దాం అని అనడంతో ధరణి, జగతి ఇద్దరు షాక్ అవుతారు. ఇదే విషయం మహేంద్ర కూడా చెప్పాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దేవయాని.
ఒకవైపు మహేంద్ర వసుధారతో మాట్లాడుతూ నేను నీకు ఇచ్చిన గురుదక్షిణ మాటలను వెనక్కి తీసుకుంటున్నాను అని అంటాడు. రిషి చేత జగతిని అమ్మ అని పిలిపించకపోయినా పర్వాలేదు కానీ మీరిద్దరూ కలిసి ఉండండి లేకపోతే మాకు మనశ్శాంతిగా ఉండదు అని అంటాడు మహేంద్ర. వసుధార మాత్రం నేనెందుకు నా మాటను మార్చుకుంటాను సార్. నేను రిషి సార్ చేత జగతి మేడంని ఎలా అయినా అమ్మ అని పిలిపించి తీరతాను అని అంటుంది వసు.
నేను నా మాటని వెనక్కి తీసుకుంటే మేడంకి కూడా అన్యాయం చేసినదాన్ని అవుతాను అని అంటుంది. అప్పుడు మహేంద్ర థాంక్యూ వసుధార నేను ఎక్కడ గురుదక్షిణ వద్దు అంటే సరే అంటావేమో అని భయపడ్డాను అని అంటాడు. అప్పుడు వారిద్దరూ కాసేపు రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు ధరణి, దేవయానికి అమృతాంజన్ రాస్తూ ఉండగా అప్పుడు దేవయాని ధరణితో వసుధార గురించి రిషి ఏమనుకుంటున్నాడో చెప్పు అని అనగా, వసు మంచి అమ్మాయి గొప్ప అమ్మాయి తెలివైన అమ్మాయి అని పొగుడుతూ మాట్లాడుతూ ఉండగా నీ మనసులోని మాట లేకపోతే రిసీ మనసులోని మాటలా అని అంటుంది దేవయాని.
తర్వాత ధరణి సరిగ్గా ఆన్సర్ చెప్పకపోయినా సరికి అక్కడినుంచి వెళ్ళిపోమని కోపంగా అరుస్తుంది. మరొకవైపు జగతి జరిగిన విషయాలు అన్ని తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు వస్తుంది. అప్పుడు జగతి రిషి గురించి అడగగా వసుధార మాత్రం మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు జగతి కోపంతో నీ మొండితనం వల్ల ఇక్కడ జీవితాలు నాశనం అయిపోతున్నాయి వసు నీ మొండిపట్టు మార్చుకుంటే నా జీవితం లాగే నీ జీవితం కూడా అయిపోతుంది అని కోపంగా మాట్లాడుతుంది జగతి.
Guppedantha Manasu:
ఎందుకు ఇలా అవుతున్నావు అర్థం కావడం లేదు నీ మీద ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో తెలియడం లేదు అంటూ కోపంతో మాట్లాడుతుంది జగతి. ఈ విషయం వదిలేయ్ అని జగతి అనగా, వసుధార మంత్రం ఎప్పటిలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు జగదీ కోపంతో వస్తువులన్ని విసిరేసి ఇక ఆపు వసుధార నీకు చెబుతున్న ఎందుకని వినిపించుకోవడం లేదు అని గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే మహేంద్ర అక్కడికి వస్తాడు. ఇక్కడ అందరి జీవితాలు నాశనం అవుతున్న మీ ఇద్దరికీ అర్థం కావడం లేదు అని గట్టిగా అరుస్తుంది జగతి.