Hero Sudeep : ఈగ సినిమాలో విలన్ గా తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించిన కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం విక్రాంత్ రణా. ఇకపోతే అనూప్ బందేరి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంటర్ థ్రిల్లర్ సినిమాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లలో జూలే 28వ తేదీన విడుదల అయింది. అయితే ఈ సినిమా కొంత వరకు పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో నిరూప్ బండారితో పాటు నీతూ అశోక్ అలాగే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా… తన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
సుదీప్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమాని అని అందరికీ తెలిసిందే. ఇక ఈ సందర్భంగా ఆయన మరోసారి తన ఫేవరెట్ స్టార్ హీరోను తలచుకోవడం ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలతో ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఎన్టీఆర్ కష్టపడే తీరు అందరికీ నచ్చుతుందని వెల్లడించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో కలిసి నటించడం అంత సులభం కాదని షాకింగ్ కామెంట్లు చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ మారిన తీరు చాలా అధ్బుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు.