HomeLatestGuppedantha Manasu serial Oct 19 Today Episode : వసు మాటలకు షాక్ అయిన...

Guppedantha Manasu serial Oct 19 Today Episode : వసు మాటలకు షాక్ అయిన దేవయాని.. పెద్దమ్మకు సర్ది చెప్పిన రిషి..?

Guppedantha Manasu serial Oct 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, గౌతమ్ ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, గౌతమ్ తెచ్చిన భోజనం తింటూ ఇది నిజంగానే హోటల్ నుంచి తెప్పించిన భోజనమేనా అని అడుగుతాడు. ఆ తర్వాత కొంచెం తిన్న రిషి బయట ఎక్కువ సేపు నుంచి ఉంటే చాలు నొప్పి పుడితే లోపలికి రా అని అంటాడు. ఇప్పుడు గౌతమ్ నేను కుడుతూనే ఉన్న కదరా అనగా నువ్వు కాదు బయట ఉన్న వసు అని అంటాడు. అప్పుడు వసు లోపలికి వెళ్లిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నావు అని అనడంతో కోపంతో భోజనం మానేయకూడదు అని భోజనం తెచ్చాను సార్ అని అంటుంది.

Advertisement
devayanis-cunning-schemes about rishi and vasu in todays guppedantha manasu serial episode
devayanis-cunning-schemes about rishi and vasu in todays guppedantha manasu serial episode

అయినా మీరు ఇంటి భోజనం అని ఎలా కనుక్కున్నారు సార్ అని అనగా నీ చేతి వంట కదా అని అంటాడు రిషి. ఆ తర్వాత వారి ముగ్గురు కలిసి పన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసు కూడా వాళ్లతో కలిసి భోజనం చేస్తుంది. ఆ తర్వాత వసుధార కాలేజీకి వెళ్లడానికి రెడీ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. దేవయానికి చూసి ఒక్కసారిగా వసుధార షాక్ అవుతుంది.

Advertisement

అప్పుడు దేవయాని కొంచెం మంచిగా మాట్లాడడంతో వెంటనే ఆమె ఏదో ప్లాన్ తో వచ్చింది అనుకున్న వసు ఏం మాట్లాడినా మౌనంగా ఉండడం బెటర్ అనుకుంటుంది. అప్పుడు దేవయాని, అయినా మనకెందుకు వసుధార ఈ గురుదక్షిణ ఒప్పందాలు లాంటివి హాయిగా నువ్వు, రిషి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోకుండా ఎందుకంటావ్ పక్క వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ నీ సంతోషాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు అని చెప్పి నేను బయట వెయిట్ చేస్తుంటాను లగేజ్ సర్దుకుని వచ్చి అని చెబుతుంది దేవయాని.

Advertisement

Guppedantha Manasu అక్టోబర్ 19 ఎపిసోడ్ : రిషి ముందే దేవయానికి వసు ఛాలెంజ్..

మరొకవైపు రిషి గౌతమ్ కాలేజీ గ్రౌండ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. అప్పుడు గౌతమ్ ఫన్నీగా మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే వసుధార రిషికి ఫోన్ చేసి తొందరగా ఇంటి దగ్గరికి రండి సార్ అని అంటుంది. దాంతో రిషి ఏం జరిగిందా అని టెన్షన్ పడుతూ అక్కడికి బయలుదేరుతాడు. ఆ తర్వాత కారు మధ్యలో ఆపి పెద్దమ్మ అక్కడికి ఎందుకు వెళ్ళింది అని ఫోన్ చేయగా దేవయాని మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు.

Advertisement

మరొకవైపు వసుధార లోపల ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఏమైంది పెద్దమ్మ ఇక్కడ ఎందుకు ఉన్నారు మీరు అని అడగగా నీ కోసమే రిషి అని అంటుంది. రిషి వసుదారని ఇంటి కోడలుగా బట్టలన్నీ సర్దుకొని ఇంటికి రమ్మన్నాను కానీ తను రావడం లేదు. నా పెద్దరికం పక్కనపెట్టి గురుదక్షిణ ఒప్పందం వదులు కోమని తన నిర్ణయం మార్పిద్దామని వచ్చాను అని అనగా రిషి, అలా చేయకూడదు పెద్దమ్మ ఎవరు నిర్ణయాలు వాళ్ళకి ఉంటాయి.

Advertisement

ఆ తర్వాత వసు అవును మేడం మన నిర్ణయాలు ఇంకోరి మీద రుద్దకూడదు కావాలి అంటే వారే మారుతారు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు నా కోసం రిసీవ్ సార్ కోసం ఇంత ఆలోచిస్తున్నారు నాకు అదే చాలు. ఇప్పటికైనా మీ ఇంటికి రావాల్సిన దాన్నే కదా రిషి సార్ కు నాకు మధ్య ఈ చిన్న ఒప్పందం తప్ప ఇంకేం అబద్ధాలు లేవు మేము బాగానే ఉన్నాము అని అంటుంది వసుధార. దాంతో వసుధర మాటలకు దేవయాని షాక్ అవుతుంది.

Advertisement

అప్పుడు దేవయాని మాట్లాడుతూ ఉండగా ఇంతలో పక్కింటి ఆవిడ ఏం వసుధర బయట మాట్లాడుతున్నారు ఏదైనా గొడవ అని అడగగా అదేం లేదు పెద్దమ్మ ఇది మా ఇంటి వ్యవహారం అని అనడంతో రిషి,దేవయాని షాక్ అవుతారు. అప్పుడు వసు దేవయాని చెవిలో మేడం మీరు భయపడకండి నేను మీ ఇంటికి వస్తాను అందరి తిక్క కుదురుస్తాను అంటుంది. అప్పుడు రిషి వెళ్దాం పదండి పెద్దమ్మ అని అనగా అక్కడి నుంచి రిషి దేవయాని వెళ్తారు. ఆ తర్వాత రిషి దేవయాని వెళ్తూ ఉండగా దేవుని దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

ఇప్పుడు ఏం జరిగిందా అని రిషి పక్కకు కారు ఆపుతాడు. రిషి ఎందుకు ఏడుస్తున్నాడు అని అనగా నేను నా పెద్దరికం ని పక్కన పెట్టి వసుధారని ఒప్పందం మానుకోమని అడిగాను. ఎలాగో మీ అమ్మానాన్నలకి నీ మీద బాధ్యత లేదు. నేనే ఆ బాధ్యత తీసుకొని మాట్లాడుదాం అనుకుంటే వసుధార నా పెద్దరికం కూడా పట్టించుకోలేదు అని అంటుంది.దానికి రిషి వాసుధార నీ ఎలా మార్చాలో నాకు తెలుసు పెద్దమ్మ మీరు మా గురించి ఏం కంగారు పడొద్దు వసుధరకి జగతి మేడం మీద ఉన్న కృతజ్ఞతా భావం కన్నా నా మీద ఉన్న ప్రేమే ఎక్కువ అని అంటాడు.

Advertisement

Read Also : Guppedantha Manasu Oct 18 Today Episode : గౌతమ్ తో ఎమోషనల్ గా మాట్లాడిన రిషి.. రిషి గురించి ఆలోచిస్తున్న మహేంద్ర జగతి..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

Most Popular

Recent Comments