Karthika Deepam: సౌందర్యతో వెళ్లిపోయిన శౌర్య.. దీపను చూసి కుమిలిపోతున్న డాక్టర్ బాబు.?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో కార్తీక్ మాటలకు దీప ఫుల్ ఎమోషనల్ అవుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో శౌర్య అందరూ అనుకుంటున్నట్లుగా మా అమ్మ నాన్నలు నిజంగా బతికే ఉంటే ఎందుకు హైదరాబాదుకు వెళ్ళలేదు అని ఆలోచిస్తూ ఈ స్లిప్పు చూస్తే మా నాన్న హ్యాండ్ రైటింగ్ లాగే ఉంది ఒకవేళ బాబాయ్ చూపినట్టుగా ఆ చారుశీల ఇలా రౌడి అని రాసి ఉంటుందా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చంద్రమ్మ అక్కడికి వచ్చి ఏంటి బంగారం ఆలోచిస్తున్నావు అనడంతో ఏం లేదు పిన్ని అందరూ అనుకున్నట్టుగా మా అమ్మ నాన్న లు నిజంగానే లేరా అని సౌర్య అడగడంతో బతికే ఉన్న మనుషులు అని చనిపోయారు అని చెబితే అంతకంటే మరొక పాపం లేదు అని ఆలోచిస్తూ ఉండగా ఏం పిన్ని మాట్లాడవు అని సౌర్య అడగగా ఏం లేదమ్మా నువ్వు మీ అమ్మ నాన్నలు ఉన్నారన్న నమ్మకంతో ఉన్నావు అదే నమ్మకంతో ఉండు ఎప్పటికైనా కనిపిస్తారు అని అంటుంది.

ఇంతలోనే ఇంద్రుడు అక్కడికి రావడంతో మనం వెళ్దాం పద బాబాయ్ ఎక్కడికి బంగారం అనడంతో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అని అంటుంది. అప్పుడు టెన్షన్ పడిన ఇంద్రుడు కొంచెం ఆకలిగా ఉంది తిన్న తర్వాత వెళ్దాం అని అబద్ధం చెబుతాడు. మరొకవైపు చారిశీల జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఏంటి సీన్ మొత్తం రివర్స్ అయ్యింది అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య కారులో వస్తుండగా నా జీవితంలో ఎప్పుడూ ఈ ఊరికి వస్తానని అనుకోలేదు అంజి. ముంబై ఢిల్లీలో తిరగాల్సిన నేను ఈ విధంగా పల్లెటూర్లలో తిరుగుతున్నాను అంటే ఎందుకు ఆ దేవుడు అంతా నాకు మంచే చేస్తాడని అనిపిస్తుంది అని అంటుంది సౌందర్య. ఇప్పుడు అంజి తప్పకుండా చేస్తాడు మేడం ఆ నమ్మకం నాకు కూడా ఉంది అని అంటాడు.

మరోవైపు చారుశీల ఆలోచిస్తూ ఎలా అయినా దీపని చనిపోబోతుంది అని అబద్ధం చెప్పి నిజంగానే చంపేద్దాం అనుకుంటే ఇప్పుడు కార్తీక్ రివర్స్ ప్లాన్ వేసి మొత్తం ప్లాన్ చెడగొట్టాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ అవకాశం పోతినేమీ ఆ ప్రాణం ఏదో నేనే తీసేస్తాను. కానీ కార్తీక్ కి ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి అని అనుకుంటూ ఉంటుంది చారుశీల. ఇంతలోనే అక్కడికి పండరి రావడంతో పండరీకి అబద్ధాలు అని చెప్పి తన చేతిలో ఉన్న టాబ్లెట్లను దీపకు ప్రతిరోజు మూడు పూటలా ఇవ్వమని చెబుతుంది. మరోవైపు సౌందర్య వాళ్ళు చంద్రుడు ఇంటికి వెళ్లడంతో వాళ్లని చూసి సౌర్య షాక్ అవుతుంది.

నేను రాను అని చెప్పాను కదా ఆనమ్మ తాతయ్యని పిలుచుకుని వస్తే నేను వస్తాను అనుకున్నావా రాను ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనడంతో చెప్పేది పూర్తిగా వినరా మీరు అంటుంది సౌందర్య. అప్పుడు ఆనందరావు మీ నానమ్మ నీతో పాటు ఇక్కడే ఉండడానికి వచ్చింది అనడంతో సౌర్య ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడకు ఇందులో మనమందరం మీ ఇంట్లో ఉండము వేరే ఇంటికి వెళ్తాము అని అక్కడి నుంచి తీసుకెళ్తుంది సౌందర్య. మరొకవైపు దీప జరిగిన విషయాలు తెలుసుకుని బాధపడుతూ ఉండగా కార్తీక్ దీపను దూరం చూసి స్వారీ దీప నీకి ఏం చెప్పాలో తెలియక అబద్ధం చెప్పాను నన్ను క్షమించు అని అనుకుంటూ ఉంటాడు.

మళ్లీ ఏడుపు మొదలు పెట్టావా దీప నికి ఎన్నిసార్లు చెప్పాలి ఏడవద్దు నువ్వు ఏడ్చి నన్ను ఇంకా బలహీనుడిని చేయొద్దు అని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ ఎంత చెప్పిన దీప వినిపించుకోకుండా అలాగే ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ బాబు మనం వాళ్ళని చూడకూడదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాము కదా కనీసం దూరం నుంచి అయినా చూస్తాను నన్ను తీసుకెళ్ళు అని అనడంతో సరే అని అంటాడు కార్తీక్. తర్వాత పండరి చారుశీల ఇచ్చిన టాబ్లెట్ ని కాఫీలో కలుపుకొని వచ్చి దీప కి ఇవ్వడంతో దీప తాగుతుంది. అప్పుడు ఏంటి పండరీ కాఫీ ఇలా ఉంది అనడంతో కాఫీ పొడి మార్చాను ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటుంది పండరి. మరొకవైపు సౌందర్య వాళ్ళందరూ కొత్త ఇంటికి వెళతారు. అప్పుడు వాళ్ళందర్నీ చూసిన హేమచంద్ర ఎన్ని రోజుల తర్వాత కొత్తగా ఇంట్లోకి అద్దకు వచ్చారు అని అనుకుంటూ ఉంటాడు.