Biggboss Telugu: వాడి వేడిగాసాగుతున్న బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఫన్నీ ఎపిసోడ్ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో కొత్త కెప్టెన్సీ టాస్క్ మొదలు అయింది. హోటల్ వర్సెస్ హోటల్ పేరుతో ఈ టాస్కు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటి సభ్యులంతా కలిసి మూడు టీములగా విడిపోయారు. రెండు టీములు రెండు హోటల్స్ నిర్వహిస్తున్నాయి. అందులో కొత్త వెయిటర్స్ గా, మరికొంత మంది చెఫ్ లుగా, హోటల్ సిబ్బందిగా పాత్రలు పోషిస్తున్నారు. మరో టీం వచ్చి ఆ హోటల్ కు వెళ్లే కస్టమర్స్ రోల్స్ పోషిస్తున్నారు.
ఈ కొత్త కెప్టెన్సీ టాస్కుకు సంబంధించి ప్రోమో తాజాగా విడుదల అయింది. ఈ ఎపిసోడ్ మొత్తం ఎలాంటి గొడవలు లేకుండా చాలా ఫన్నీ ఫన్నీగా సాగినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. అయితే ఆర్జే సూర్య కు ఏదో పినిష్ మెంట్ పడ్డట్లు అర్థం అవుతోంది. అందుకే ప్రోమో చివర్లో లేడీస్ ధరించే స్కర్ట్ వేసుకుని కనిపించాడు ఆర్జే సూర్య. ఇక శ్రీ సత్య ఈ ప్రోమోలో చాలా అందంగా కనిపించింది. వెల్వెట్ క్లాస్ మిడ్డీలో హాట్ హాట్ గా కనిపిస్తోంది.
అయితే బిగ్ బాస్ హౌస్ ప్రారంభమైనప్పటి నుంచి గొడవలు, ఏడుపులు, రచ్చతోనో కొనసాగుతోంది. అయితే ఈసారి ప్రోమో చూసిన వాళ్లు కాస్త నవ్వులా ఉండటంతో ఈ ఎపిసోడ్ చూడాల్సిందేనని చాలా మంది భావిస్తున్నారు. మరి చూడాలా ఏం జరగనుందో.