bigg-boss-telugu-ott-live-bigg-boss-non-stop-trolls-on-nataraj-master
Bigg Boss Telugu OTT Live : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మాజీ కంటెస్టెంట్స్ కొత్త కంటెస్టెంట్స్ మధ్య రచ్చ రంబోలా గా మారింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం వెళ్లడం తోనే కంటెస్టెంట్స్ కి పెద్ద టాస్క్ ని బిగ్ బాస్ ఇచ్చాడు. సీనియర్లకు ర్యాగింగ్ చేయమని..జూనియర్లు ఇబ్బంది పెట్టమని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత సీనియర్ల ను ఇబ్బంది పెట్టమని జూనియర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇలా రకరకాల స్కిట్ల తో.. సరదా కార్యక్రమాలతో సరదా సరదాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ సాగిపోతుంది.
ఈ సందర్భంగా ఇంటి సభ్యులందరూ ఒక ఫన్నీ కన్వర్జేషన్ చేశారు. ఆ సందర్భంగా ఎవరికైనా పెళ్ళికి ముందు లవర్ ఉందా… ప్రస్తుతం ఏమైనా లవ్ ఎఫైర్లు ఉన్నాయా అనేది చర్చించుకున్నారు. ఎవరితో ఎలా వ్యవహరిస్తారు.. ఎవరంటే జీవితంలో ప్రత్యేకం అంటూ సరదా సరదా ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఒక కంటెస్టెంట్ మీకు పెళ్లి కి ముందు ఏమైనా లవ్ ఎఫైర్ ఉన్నదా అంటూ నట్రాజ్ మాస్టర్ ని ప్రశ్నించారు. ఆ సమయంలో నట్రాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 120 మంది ఉన్నారు. అయితే ఆ వారిలో నేను ఏ ఒక్కరిని ప్రేమించలేదు. వారు అందరినీ నేను రిజెక్ట్ చేశాను అంటూ చేసిన వ్యాఖ్యలు అతని అవివేకాన్ని తెలియ జేస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
గత బిగ్బాస్ సీజన్ లో ఆయన వ్యవహరించిన తీరు విమర్శల పాలు అయింది. యాంకర్ రవి తో పాటు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేసి ఆయన జంతువుల మాదిరిగా పేర్లు పెట్టడం.. అలాగే ఏ గేమ్ లో అయినా తేడా వస్తే అందరూ కలిసి ఆడి నన్ను ఒంటరిని చేస్తున్నారంటూ ఏడవడం చేసేవాడు.
ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. నామినేషన్ సమయం లో అందరూ తనని నామినేట్ చేశారు అంటూ నట్రాజ్ మాస్టర్ ఏడ్చేశాడు. ఇప్పుడు 120 మంది నన్ను ప్రేమించారంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంత ఓవరాక్షన్ చేస్తే త్వరలోనే బయటకు వస్తారు గురూజీ అంటూ ఆయనకు కొందరు కౌంటర్ ఇస్తున్నారు.
Read Also : Bigg Boss Telugu OTT Live : లైవ్ స్ట్రీమింగ్ అసలు నిజమేనా? ఎంత మంది చూస్తున్నారు?
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.