Udaya bhanu : ఒకప్పుడు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన యాంకర్ ఉదయ్ భాను. తన అందం, అభినయంతో బుల్లితెరను ఓ ఊపు ఊపింది. నాడు తెలుగులో టాప్ యాంకర్ గా రాణించిన ఆమె కొన్నేళ్లుగా యాంకరింగ్ కు దూరంగా ఉంది. తాజాగా ఆమె కమ్ బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాంగగా కొద్ది రోజులుగా వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ… యూట్యూబ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. కొత్త పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రాంరభించిన ఆమె… మీ ప్రేమే నా బలం పేరుతో మొట్ట మొదటి వీడియోను పెట్టింది.
మీ అభిమానం నేను సంపాదించిన వరం. మీ ప్రేమ అభివర్ణించలేనిదది, నా ప్రతి అడుగులో మీరు నాకు తోడుగా నిలబడి, నాకు ధైర్యం ఇచ్చింది మీరే అంటూ అభిమానుల కోసం ఉద్వేగపూరితంగా మాట్లాడింది. మీ అభిమానంతే నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారని వివరించింది. అలాగే మీకు మరింత దగ్గరయ్యేందుకు మళ్లీ వస్తున్నాను అంటూ వీడియోను ముగించింది ఇన్నాళ్ల తర్వాత మాకోసం యూట్యూబ్ లో అడుగు పెట్టినందుకు థాంక్యూ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.