anaki-decides-to-reveal-the-truth-about-jessie-to-jnanamba-in-todays-janaki-kalaganaedu-serial-episode
Janaki Kalaganaledu September 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి ఎలా అయినా జ్ఞానాంబ తో అసలు విషయం చెప్పాలి అని అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా అప్పుడు మల్లిక, జానకి అఖిలను ఇరికించే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు వెంటనే జానకి ఏమీ లేదు అత్తయ్య అఖిల్ బాగా చదవడం కోసం తన భవిష్యత్తు కోసం కొన్ని విషయాలను చెప్పాను అని చెబుతుంది. ఇక ఇదే మంచి అవకాశం అత్తయ్య గారికి నిజం చెప్పేస్తాను అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి లీలావతి వస్తుంది.
అప్పుడు జ్ఞానాంబ ఏంటి నీలావతి ఇలా వచ్చావు అని అడగగా పక్క ఊరికి వెళ్లి ఇలా వస్తున్నాను అఖిల్ కి మంచి సంబంధం చూశాను అని అనడంతో వెంటనే జ్ఞానాంబ వాడికి ఇప్పుడే పెళ్లి ఎందుకు ఇంకా చిన్న పిల్లవాడు చదువు పూర్తి అవ్వనివ్వు అని అంటుంది. అప్పుడు జానకి ఇప్పుడు అత్తయ్య గారికి ఈ విషయం చెప్పకపోవడమే మంచిది అని అనుకుంటుంది. రామచంద్ర కూడా తన తల్లి మాటలకే వత్తాసు పలుకుతాడు.
అప్పుడు జానకిని గమనించిన మల్లిక జానకి మానుసులో ఏదో ఉంది లేకపోతే ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తరువాత వెళ్ళిన జానకి జెస్సీ తల్లిదండ్రులు ఇచ్చిన గడువు పూర్తి అవుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇంతలోనే రామచంద్ర ని పిలిచి తన ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పమని చెబుతుందిఅప్పుడు రామా,పోలీస్ అంటేనే ముందు రిస్క్ తీసుకోవాలి.
ప్రతి విషయంలోనే ధైర్యంగా ఉండాలి, మీరు చేసేది మంచి అయితే ఎప్పటికైనా శుభం జరుగుతుంది అని అంటాడు. దానికి జానకి రామ గారు చెప్పేదాన్ని బట్టి, ముందు అత్తయ్య గారికి విషయం చెప్పేద్దాము,ముందు కోప్పడినా సరే క్షమించి పెళ్లి చేస్తారని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జ్ఞానాంబ ఇంటి ముందు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.
అప్పుడు ఇంట్లో అందరూ సంతోషంగా అందులో పాల్గొంటుండగా అఖిల్ డల్ గా ఉండడంతో గోవిందరాజులు ఏమయింది అని అడుగగా ఏమీ లేదు అనే అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు అఖిల్. ఆ తర్వాత అఖిల్ ప్రవర్తనైన గమనించిన మల్లిక అసలు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మల్లిక అందరికీ పనులు చెబుతూ ఉండగా వెంటనే గోవిందరాజులు అమ్మ పుల్లల మల్లిక సైలెంట్ గా ఒక పక్కకు వెళ్లి కూర్చో అని అంటాడు. అప్పుడు మల్లిక ఎలా అయినా జానకిని అవమానిస్తాను అని తను తింటున్న అరటి తొక్కను తీసి జానకి కాళ్ల కిందికు వేస్తుంది.
అప్పుడు జానకి పడిపోతూ ఉండగా రామా జానకిని పట్టుకుంటాడు. అప్పుడు జానకి చేతిలో ఉన్న పువ్వులు వారి మీద అక్షంతల్లా పడటంతో అది చూసి మల్లికా కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంతలోనే జ్ఞానాంబ బయటకు వచ్చి ఏమైంది జానకి అని అడగగా జానకి పూజలు కావలసిన పూలు మొత్తం నాశనం చేసింది జానకి వాటిలో ఒకదానిని కొట్టేయండి అత్తయ్య గారు అని అంటుంది మల్లిక అప్పుడు జ్ఞానం బా మల్లికను నోరు మూసుకొని ఉంటావా అని తిడుతుంది. గోవిందరాజులు కూడా మల్లికను తిడతాడు.
Read Also : Ennenno Janmala Bandham serial : చిత్ర, వసంత్‌ల పెళ్లిపై గొడవ పడిన వేద, యష్..
Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
This website uses cookies.