Guntur kid: అతి చిన్న వయసులోనే ఆర్చరీలో అదరగొడుతున్నాడో ఆంధ్రా అబ్బాయి. తొమ్మిదేళ్ల ఆరుష్ అస్త్ర విద్యలో ఆరితేరాడు. చిన్న వయసులోనే ఎన్నెన్నో అవార్డులను అందుకొని… అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంటూ… ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అండర్-9 కేటగిరిలోనే గోల్డ్ మెడల్ వరల్డ్ సిరీస్ లో 17వ స్థానం సాధించి అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన మాలపటి చెంచి రెడ్డి, శాంతి దంపతుల ముద్గుల కుమారుడే ఈ ఆరుష్.
తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. అయితే ఆరుష్ కు ఉన్న ఏకాగ్రతను గమనించిన తల్లిదండ్రులు… అతడికి ఆర్చురీ నేర్పించాలనుకున్నారు. అయితే మాత్రం మూడేళ్లకే విల్లు చేతపట్టి విజయవాడలోని చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీలో చేరాడు. ఇక అప్పటి నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన ఆరుష్ ఎన్నెన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. నాలుగేళ్ల వయసులోనే ఎషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.
2018లో నేషనల్ కాంపిటిషన్ లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2019లో మకావులో జరిగిన వరల్డ్ ఆర్చరీ సిరీస్ ఓపెన్ లో 17వ స్థఆనం సాధించాడు. 2022 మేలో అండర్-9 కేటగిరీలో నేషనల్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో ఒలంపిక్ రౌండ్ లో గోల్డ్ మెడల్, మిక్స్ డ్ టీమ్ లో గోల్డ్ మెడల్, రాకింగ్ రౌండ్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. అయితే ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న ఆరుష్.. ఒలంపిక్స్ లో గోల్ట్ మెడల్ సాధించడమే త లక్ష్యం అని చెప్తున్నాడు.