G
Telugu News » Videos » a tirumala venkateswara swamy a devotee do this for mokkulu video goes viral
⚡ Videos, Latest

Thirumala: ఏమాత్రం కష్టపడకుండా,సులభంగా స్వామివారికి మొక్కులు తీర్చుకున్న భక్తుడు.. వీడియో వైరల్!

Thirumala: సాధారణంగా ఎంతో మంది భక్తులు వారి కోరికలను తీర్చమని స్వామివారిని మొక్కుకొని ఆ కోరికలు తీర్చిన అనంతరం స్వామి వారికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లిస్తుంటా

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Thirumala: సాధారణంగా ఎంతో మంది భక్తులు వారి కోరికలను తీర్చమని స్వామివారిని మొక్కుకొని ఆ కోరికలు తీర్చిన అనంతరం స్వామి వారికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.అయితే భక్తుల మొక్కుబడి ప్రకారం చాలా మంది మెట్ల మార్గం గుండా స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. అలాగే కొందరు మోకాళ్లపై నడిచి వస్తానని మొక్కుకుంటారు. మరికొందరు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాసి కర్పూర హారతి ఇస్తూ వెళ్తుంటారు.

ఈ విధంగా ప్రతి మెట్టుకు కర్పూరహారతి ఇచ్చి వెళ్ళాలి అంటే ఎంతో కష్టంతో కూడుకున్నది. ఈ క్రమంలోనే స్వామివారి మెట్లపై కర్పూరాన్ని ఏ మాత్రం నడుము వంచకుండా కష్టపడకుండా ఎంతో సునాయాసంగా వెలిగిస్తూ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చని పలువురు భక్తులు తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో భాగంగా ప్రతి మెట్టుపై కర్పూరం వెలిగిస్తూ ఏమాత్రం నడుము వంచకుండా స్వామి వారి సన్నిధికి చేరుకోవచ్చని నిరూపించారు.

ఈ క్రమంలోనే పొడువాటి పైప్ సహాయంతో మెట్లపై కర్పూరం పెట్టగా మరొక వ్యక్తి పొడవాటి కర్రలకు మంట వెలిగించుకొని ఆ కర్ర సహాయంతో మెట్ల పై ఉన్న కర్పూరాన్ని వెలిగిస్తూ ఏమాత్రం కష్టం లేకుండా వారి మొక్కును తీర్చుకున్నారు.అయితే ఈ వీడియో చూసిన కొందరు ఈ విధంగా కూడా మొక్కులు తీర్చుకోవచ్చా అంటూ ఆశ్చర్యపోగా, మరికొందరు స్వామివారికి మొక్కు చెల్లించే సమయంలో కూడా ఏమాత్రం కష్టపడకుండా ఇలా చెయ్యడంతో వీరిపై మరి కొందరు విమర్శలు చేస్తున్నారు.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷mokkulusocial mediaThirumalavideo viral
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు