G
Telugu News » TV Serials » devi chinmayi meet adithya in todays devatha serial episode
⚡ TV Serials, Latest

Devatha : ఆదిత్యకు దగ్గరైన దేవి, చిన్మయి.. మాధవ ఏం చేయనున్నాడు..?

Devatha, devatha march 25th today episode, telugu news, దేవత సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Devatha March 25th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. చిన్మయి పుట్టినరోజు సందర్భంగా మాధవ పిల్లలిద్దరికీ డ్రెస్సులు తీసుకొని వస్తాడు. దేవికి మగ పిల్లల డ్రెస్సు, చిన్మయికి పొడవాటి గౌను తీసుకొని రాగా పిల్లలు వాటిని వేసుకుని వస్తారు. వాళ్లను చూసిన మాధవ చిన్మయి నా కూతురులా ఉండాలి, దేవీ నా కొడుకులా ఉండాలి అని అనడం తో రాదా షాక్ అవుతుంది.

ఆ తరువాత రాధ అదే విషయం గురించి మాధవ తో మాట్లాడాలి అని వెళ్లగా, అప్పుడు మాధవ రాధా తనకు ఏం మాట్లాడటానికి వచ్చిందో ముందే గ్రహించి రాధా ఆడబిడ్డ అంటే ఎప్పుడో ఒకసారి అత్తారింటికి వెళ్లి పోవాల్సిందే కానీ మగ బిడ్డ అయితే మనతో ఉంటాడు. తలకొరివి పెట్టేది దేవినే అంటూ ఎమోషనల్ గా మాట్లాడేసరికి రాధా మౌనంగా ఉండి పోతుంది. మరొకవైపు ఆదిత్య గురించి దేవికి రాధ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా దేవి వినిపించుకోదు. మరోవైపు ఆదిత్య దేవి కోసం ఇంట్లో బొమ్మలు అన్నీ తెచ్చి పెట్టడంతో ఇంట్లో వారు ఏమి అర్థం కాక ఆదిత్య నిలదీస్తారు.

Devatha March 25th Today Episode

మరొకవైపు చిన్మయి,దేవి లు స్కూల్ కి వెళ్తారు. అప్పుడు దేవి అక్క ఈ రోజు నీ బర్త్ డే కదా ఏం కావాలో అడుగు అని అనగా అప్పుడు చిన్మయి ఏమడిగినా ఇస్తావా అని ప్రామిస్ చేయించుకుంటుంది. అప్పుడు ఏమిటి అక్క అని దేవి అడగగా.. అప్పుడు చిన్మయి నువ్వు ఎప్పటిలాగే ఆఫీసర్ సారు తో మాట్లాడాలి.

కోపంగా ఉండకూడదు అని అనడంతో దేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చిన్మయి కోరిక మేరకు దేవి చాక్లెట్ తీసుకొని వెళ్ళి ఆదిత్యకు ఇస్తుంది. మా అక్క లు మాట ఇచ్చిన అందుకే నేను నీతో మాట్లాడుతున్నాను అని అనడంతో అప్పుడు ఆదిత్య ఎమోషనల్ అవుతాడు. నేను మీ అమ్మని అవమానించాను అనే కదమ్మా నీకు కోపం సరే పద అని నీ ముందే మీ అమ్మకు క్షమాపణలు చెబుతా అని ఆదిత్య దేవిని తీసుకుని రాధ దగ్గరకు వెళ్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Devatha : ఆదిత్య ప్రవర్తనతో ఆందోళన చెందుతున్న సత్య… ఆదిత్య ఆశలకు అడ్డుకట్ట వేస్తున్న రుక్మిణి!

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷adithyaDevathadevatha serialdevatha serial todaydevatha todaydeviradha
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు