YS Jagan : జగన్‌కు ఎందుకు ఇన్ని యూటర్నులు..? మొన్న మూడు రాజధానులు.. నిన్న మండలి..!

YS Jagan : గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ఇక సీఎం బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ అప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. మొదటి నుంచి సంక్షేమ పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించారు. కానీ ప్రస్తుతం ఆయన మొదట్లో తీసుకున్న నిర్ణయాలపై యూటర్న్ తీసుకుంటున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఎలాగైనా మూడు రాజధానులు నిర్మించి తీరుతామని మొదటి నుంచి పట్టుబట్టిన జగన్.. ప్రస్తుతం ఆ విషయంలో వెనకడుగు వేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును సైతం ఇటీవలే అసెంబ్లీలో రద్దు చేశారు. ఇందులో ఆమోదం సైతం వేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

దాని నుంచి పొలిటికల్ లీడర్స్ ఇంకా తేరుకోకముందే మొదట్లో శాసన మండలిని రద్దు చేసేందుకు పెట్టిన బిల్లును సైతం తాజాగా వద్దనుకున్నారు. ఆ బిల్లును సైతం రద్దు చేశారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో శాసన మండలిలో టీడీపీకి చెందిన నాయకులు ఎక్కువగా ఉన్నారు. దీంతో మండలిని రద్దు చేయాలని 2020 జనవరిలో అసెంబ్లీలో బిల్లుపెట్టి ఆమోదించారు. శాసనమండలితో ఎలాంటి ప్రయోజనం లేదని, ఇందుకు ఖర్చు చేస్తే డబ్బులు సైతం వృథా అవుతున్నాయని అప్పట్లో కామెంట్స్ చేశారు జగన్.

ఇక మండలి రద్దు చేయాల్సిందేనని మొదట్లో పట్టుబట్టిన జగన్.. నిజంగానే దానిపై దృష్టిసారించి ఉంటే కేంద్రం పై ఒత్తిడి చేసి రద్దు చేయించేవారు. కానీ ప్రస్తుతం మండలిలో వైసీపీ నాయకులు ఎక్కువగా ఉండటంతో దానిని రద్దు చేసేందుకు జగన్ వెనకడుగు వేశారని టాక్. ఇదంతా రాజకీయం కోసం చేసిన పనేనని పలువురు పొలిటికల్ లీడర్స్ అంటున్నారు. మొత్తానికి రోజుల వ్యవధిలోనే జగన్ తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆలోచనలో పడేశాయి. మరి మున్ముందు వైసీపీ ప్రభుత్వం ఇంకెన్నీ యూటర్నులు తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Read Also : Three Bills Withdrawn : ఆ ఇద్దరు నేతలకూ ‘మూడు’ తోనే చిక్కులు.. ఇమేజ్ డౌన్ అయిందిగా!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel