Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

KA Paul: తెలంగాణ ఎన్నికలపై కేఏ పాల్ జోస్యం.. ఏమన్నారంటే?

KA Paul: తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈరోజు ఆయన తిరుపతిల

By Vinod Kumar

Published on: August 2, 2022 8:23 PM

Updated on: August 2, 2022 8:23 PM

---Advertisement---

KA Paul: తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని… తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈరోజు ఆయన తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతానని… ఏపీకి ఒక మహిళను ముఖఅయమంత్రిని చేస్తానని ఆయన వివరించారు. తెలంగాణ సీఎం కేసఆర్ గురించి వ్యాఖ్యానిస్తూ కేసీఆర్ ఖబడ్దార్.. నేను బటన్ నొక్కితే జైలుకు పోతావంటూ హెచ్చరించారు. తాను అధికారంలకి వచ్చాక రేప్ చేసే వారి సంగతి తెలుస్తానని కేఏ పాల్ చెప్పారు.

KA Paul Comments on Telangana Elections

Advertisement

సీమ నుంచి ఎన్నికైన సీఎంలు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదని రాయలసీమ రాక్షస సీమగా మార్చానని కేఏ పాల్ ఆంధ్ర ప్రదేశ్ గురించి అన్నారు. ఏపీ సీఎం జగన్ కూడా సీమకు అన్యాయం చేస్తున్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలనకు ఇక ప్రజలు స్వస్తి పలకాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని శ్రీలంక, సుడాన్, నైజీరియా, జింబాబ్వే దేశాలుగా చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. స్మార్ట్ సిటీలు, ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఏమయ్యాయని బీజేపీ నాయకులను కేఏ పాల్ ప్రశ్నించారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.