G
Telugu News » Movie Reviews » ranga ranga vaibhavanga vaishnav tejs rangaranga vaibhavanga movie twitter review
⚡ Movie Reviews, Latest

Ranga Ranga vaibhavanga: వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా సినిమా ట్విట్టర్ రివ్యూ..సినిమా ఎలా ఉందంటే?

Ranga Ranga vaibhavanga: మెగా హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ ఉప్పె

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Ranga Ranga vaibhavanga: మెగా హీరో వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో వైష్ణవ్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నటించిన కొండపాలెం సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం వైష్ణవ తేజ్ రంగ రంగ వైభవంగా అనే సినిమా ద్వారా ప్రేమికుల ముందుకి వచ్చాడు.
గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.

లవ్ అండ్ ఎమోషనల్ స్టొరీ తో రూపొందించిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కి జోడిగా కేతిక శర్మ నటించింది. ప్రేమకథతో వినోదాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజు విడుదలై ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వస్తోంది. తాజగా విడుదలైన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఏంటో తెలుసుకుందాం. తాజాగా విడుదలైన ‘రంగరంగ వైభవంగా’ మూవీ ప్యూర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా యావరేజ్ గా ఉందని ట్విట్టర్లో రివ్యూ ఇస్తున్నారు.

ఈ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం నటీనటుల పరిచయం హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ చూపించారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. సెకండ్ హాఫ్ చాలా బోరింగ్ గా ఉందని ఇక క్లైమాక్స్ మొత్తం తేలిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, సత్య కామెడీ, దేవిశ్రీ అందించిన పాటలు ప్లస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే , సినిమాలో ఎమోషన్స్ పండక పోవటం వంటివి ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గా పరిగణించవచ్చు.

Advertisement

Ranga Ranga vaibhavanga:

ఓవరాల్ గా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇస్తున్న కామెంట్స్ ప్రకారం ఈ సినిమాని చూస్తే గతంలో చూసిన కొన్ని సినిమాల్లో గుర్తుకు వస్తాయని, కాకుండా వేరే సినిమాల నుండి కొన్ని సీన్లు కాపీ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాయింట్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవు. దీంతో ఏ సినిమాకి ట్విట్టర్ లో యావరేజ్ టాక్ వినిపిస్తోంది.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷ChiranjeeviDevi Sri PrasadDirected by GirishayyaRanga Ranga vaibhavangaSri Venkateswara movie banneruppena movieVaishnav Tej
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు